ఐపిఎల్ ఎడిషన్ వెంటో, పోలో కార్లను విడుదచేసిన ఫోక్స్‌వ్యాగన్

గత కథనంలో తెలుగు డ్రైవ్ స్పార్క్ ప్రకటించినట్లుగానే జర్మన్ లగ్జరీ కార్ మేకర్ ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న వెంటో సెడాన్, పోలో హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఐపిఎల్ ఎడిషన్ వేరియంట్లను ప్రవేశపెట్టింది. ఐపిఎల్ ఎడిషన్ వేరియంట్లలో, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మోడళ్ల కన్నా అధనపు ఫీచర్లను జోడించి కంపెనీ విక్రయించనుంది. ఈ స్పెషల్ ఎడిషన్ వేరియంట్లలో లభించనున్న ఫీచర్లు, వాటి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

ఐపిఎల్ ఎడిషన్ వెంటో, పోలో కార్లలో బిల్ట్-ఇన్ నావిగేషన్ సిస్టమ్, రియర్ ప్యాసింజర్ కోసం సోషల్ నెట్‌వర్కింగ్ ఆప్షన్, ఐ-పాడ్ కంట్రోల్, బిల్ట్-ఇన్ మైక్రో ఎస్‌డి, మిని యూఎస్‌బి ఇంటర్‌ఫేస్, ఎమ్‌పి3, డబ్ల్యూఎమ్ఏ సపోర్ట్, పార్కింగ్ అసిస్ట్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన టచ్-స్క్రీన్ మల్టీ మీడియా ప్లేయర్, విలాసవంతమైన లెథర్ సీట్స్, ఐపిఎల్ లోగోతో డిజైన్ చేయబడిన ఎక్స్టీరియర్ డోర్స్ డిజైన్, ఐపిఎల్ లోగోతో కూడిన ఫ్లోర్ మ్యాట్స్ వంటి విశిష్టమైన ఫీచర్లు లభ్యం కానున్నాయి.

ఐపిఎల్ ఎడిషన్ వెంటో, పోలో కార్ల ధరలు ఈ విధంగా ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ పోలో ఐపిఎల్ ఎడిషన్ 2
* 1.2 పెట్రోల్ హైలైన్ - రూ.6.13 లక్షలు
* 1.6 పెట్రోల్ హైలైన్ - రూ.6.48 లక్షలు
* 1.2 డీజిల్ హైలైన్ - రూ.7.16 లక్షలు

ఫోక్స్‌వ్యాగన్ వెంటో ఐపిఎల్ ఎడిషన్ 2
* 1.6 పెట్రోల్ ట్రెండ్‌లైన్ - రూ.7.08 లక్షలు
* 1.6 పెట్రోల్ హైలైన్ - రూ.8.23 లక్షలు
* 1.6 పెట్రోల్ హైలైన్ ఆటోమేటిక్ - రూ.9.21 లక్షలు
* 1.6 డీజిల్ ట్రెండ్‌లైన్ - రూ.8.28 లక్షలు

గడచిన సంవత్సరంలో కూడా ఫోక్స్‌వ్యాగన్ వెంటో సెడాన్‌లో ఓ ఐపిఎల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. గతంలో ఫోక్స్‌వ్యాగన్ విడుదల చేసిన ఐపిఎల్ ఎడిషన్ వెంటోలో ఐపిఎల్ లోగో డిజైన్ చేసి, ఈ కారును కొనుగోలు చేసిన వారికి క్రికెట్ కిట్‌ను కూడా కంపెనీ ఉచితంగా అందించింది. ఏప్రిల్ 4వ తేదీ నుండి ఐపిఎల్ 20-20 సీజన్ 5 ప్రారంభం కానుంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 17, 2012, 13:16 [IST]
English summary
Cashing in on the success of the cash-rich Indian Premier League, German automaker Volkswagen has launched its IPL edition variants for its premium hatchback Polo and premium sedan Vento.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+