మహీంద్రా బొలెరో ఎస్‌యూవీ ఖాతాలో మరో మైలురాయి
భారతదేశపు ప్రముఖ ఎస్‌యూవీ తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) లిమిటెడ్ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ 'బొలెరో' మరో అరుదైన మైలురాయిని తన ఖాతాలో వేసుకుంది. గడచిన మార్చి నెలతో ముగిసిన 2011-12 త్రైమాసికంలో బొలెరో లక్షకు పైగా అమ్మకాల మార్కును తాకింది. 2011-12 కంపెనీ మొత్తం 1,00,686 బొలెరోలను విక్రయించింది.
అంతేకాకుండా, బొలెరో వరుసగా 6వ సంవత్సరం కూడా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా పేరు తెచ్చుకుంది. ఇదివరకటి ఆర్థిక సంవత్సరం (2010-11)లో ఎమ్ అండ్ ఎమ్ మొత్తం 83,112 బొలెరోలను విక్రయించింది. బడ్జెట్ భయంతో ఒక్క మార్చి 2012 నెలలోనే 10,026 బొలెరోలు అమ్ముడయ్యాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో గడచిన ఆర్థిక సవంత్సరం (2011-12)లో అత్యధికంగా అమ్ముడవుతున్న ప్యాసింజర్ వాహనాల జాబితాలో బొలెరో 7వ స్థానాన్ని ఆక్రమించుకుంది.

బొలెరోను తొలిసారిగా ఆగస్టు 2000లో మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లోకి విడుదల చేసింది. ఎమ్ అండ్ ఎమ్ ఎప్పటికప్పుడు ఈ మోడల్‌కు మారుతున్న టెక్నాలజీని జోడిస్తూ, అప్‌గ్రేడ్ చేస్తూ వస్తోంది. కంపెనీ ఇటీవల విడుదల చేసిన న్యూ బొలెరోలో ఎమ్2డిఐసిఆర్ ఇంజన్ మంచి పెర్ఫామెన్స్‌తో పాటుగా ఉత్తమమైన మైలేజ్‌ను ఆఫర్ చేస్తుంది.
ఇందులో అడ్వాన్స్‌డ్ డిజిటల్ డిస్‌ప్లే, డ్రైవర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ (డిఐఎస్), డిజిటల్ ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటి అధునాత సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించటం జరిగింది. అంతేకాకుండా ఇందులో సరికొత్త స్టయిలిష్ డ్యాష్‌బోర్డ్, వుడ్-ఫినిషింగ్ చేయబడిన సెంట్రల్ కన్సోల్, సరికొత్త సీట్స్, ఇంటీరియర్స్ వంటి ఫీచర్లను కూడా కంపెనీ జోడించింది.


Click it and Unblock the Notifications








