బడ్జెట్ భారం: భారీగా పెరగనున్న చిన్న కార్ల ధరలు

చిన్న కారు కొనాలనుకునే వారి కారు కల కలగానే మిగిలిపోనుందా..! ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అవుననే చెప్పాలి. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణభ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2012-13లో ఎక్సైజ్ సుంఖాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల కార్ల తయారీదారులు నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా పెరిగిన ఎక్సైజ్ సుంఖాల కారణంగా తమపై పడుతున్న అధనపు భారాన్ని తక్షణమే వినియోగారులపై నెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

చిన్న, పెద్ద కార్లపై పెరిగిన ఎక్సైజ్ సుంఖాల కారణంగా అతి త్వరలోనే ఉత్పత్తుల ధరలను పెంచనున్నామని మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా అండ్‌ మహీంద్రా వంటి కంపెనీలు తెలిపాయి. ఈ ప్రభావం వలన చిన్న కార్ల ధరలు రూ.4,000 నుండి రూ.20,000 వరకూ, పెద్ద కార్ల ధరలు రూ.35,000 నుండి సుమారు రూ.3 లక్షల వరకూ పెరగనున్నాయి. కొన్ని కంపెనీలు శుక్రవారం అర్థరాత్రి నుంచే ధరలు పెంచాయి.

యూనియన్ బడ్జెట్ 2012-13లో చిన్న కార్లపై ఎక్సైజ్ సుంఖాన్ని 10 నుండి 12 శాతానికి, పెద్ద కార్లపై ఎక్సైజ్ సుంఖాన్ని 22 శాతం నుండి 27 శాతానికి పెంచడం జరిగింది. దీంతో మారుతి సుజుకి ఆల్టో, స్విఫ్ట్, హ్యుందా ఐ10, ఇయాన్, శాంత్రో, ఐ20, టాటా ఇండికా వంటి పలు చిన్న కార్ల ధరలు మరింత పెరగనున్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, March 17, 2012, 16:59 [IST]
English summary
Union Budget 2012-13 has forced carmakers to increase prices from midnight today following the excise duty hike in the country. Prices of small cars - Maruti Suzuki Alto, Swift; Hyundai i10, i20 and Tata Indica will increase by Rs 4,000-20,000 depending on different variants.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+