కర్ణాటకలో రూ.1,000 కోట్ల పెట్టుబడులు: టాటా మోటార్స్
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ కర్ణాటకలో భారీ పెట్టుబడులను వెచ్చించనుంది. కర్ణాటలోని ధార్వాడ్‌లో నిర్మిస్తున్న ప్లాంటు కోసం రానున్న రెండేళ్లలో దాదాపు రూ.800 కోట్ల నుండి రూ.1,000 కోట్ల వరకూ పెట్టుబడులను టాటా మోటార్స్ కేటాయించనుంది. ధార్వాడ్‌లో నెలకొల్పుతున్న ఈ అధనపు ప్లాంటు ద్వారా వార్షికంగా 90,000 యూనిట్లను టాటా మోటార్స్ ఉత్పత్తి చేయనుంది.
ఈ ప్లాంటులో కేవలం టాటా ఏస్ జిప్, మ్యాజిక్ ఐరిస్ వాహనాలను మాత్రమే కంపెనీ తయారు చేయనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ ప్లాంటులో పూర్తిస్థాయి ఉత్పత్తిని సాధించనున్నామని టాటా మోటార్స్ అధ్యక్షుడు (కమర్షియల్ వెహికల్ యూనిట్) రవి పిషారోడి తెలిపారు.
అరటన్ను పేలోడ్ సామర్థ్యం కలిగిన ఏస్ జిప్, మ్యాజిక్ ఐరిస్ వాహనాలను గడచిన మే నెలలో కంపెనీ విడుదల చేసింది. టాటా ఏస్ నెలకు సుమారు 3,000 యూనిట్ల వరకూ అమ్ముడవుతుండగా, టాటా మ్యాజిక్ ఐరిస్ వాహనాలు దాదాపు 1,000 యూనిట్ల వరకూ అమ్ముడవుతున్నాయి.


Click it and Unblock the Notifications









