హ్యుందాయ్ డీజిల్ వెర్నా, ఐ20 వెయిటింగ్ పీరియడ్ తగ్గింపు

దేశీయ ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న డీజిల్ వేరియంట్ వెర్నా సెడాన్, ఐ20 హ్యాచ్‌బ్యాక్‌ల వెయింట్ పీరియడ్ సగానికి పైగా తగ్గనుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో డీజిల్ కార్లకు డిమాండ్ జోరందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు మోడళ్ల డీజిల్ వేరియంట్ల ఉత్పత్తిని సగానికిపై పెంచనున్నామని కంపెనీ పేర్కొంది.

ఇది వరకూ ఈ రెండు మోడళ్లకు డీజిల్ ఇంజన్ల సరఫరా నెలకు 7,000 యూనిట్లుగా ఉన్నాయని, ప్రస్తుతం వీటిని 10,500 (50 శాతం పెంపు) యూనిట్లకు పెంచామని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) అరవింద్‌ సక్సేనా తెలిపారు. వెర్నా, ఐ20 మోడళ్లకు కావల్సిన డీజిల్‌ ఇంజన్‌లను దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఆయన చెప్పారు.

ఈ మోడళ్ల ఉత్పత్తిని పెంచడంతో వీటి వెయింటిగ్ పీరియడ్ గణనీయంగా తగ్గనుందని సక్సేనా తెలిపారు. ప్రస్తుతం డీజిల్‌ వెర్నా వెయిటింగ్‌ పీరయడ్ 6 నెలల నుంచి 2-3 నెలలకు తగ్గించనున్నామని, అలాగే కొత్త ఐజెన్‌ ఐ20 డీజిల్ మోడల్ వెయిటింగ్‌ పీరియడ్‌ను నెలకు తగ్గించనున్నామని ఆయన తెలిపారు. ఈ సౌకర్యం కోసం రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టామని సక్సేనా వివరించారు.

More from DriveSpark

Article Published On: Tuesday, April 17, 2012, 10:31 [IST]
English summary
India's second largest carmaker Hyundai Motor India (HMI) said it has ramped up the production capacity of diesel variants of its sedan Verna and compact car i20 by up to 50 per cent from this month. "The supply of both the diesel cars taken together will go up almost 50 per cent from the existing 7,000 units per month to 10,500 units per month," Hyundai Motor India Ltd (HMIL) said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+