లీటరు ఇంధనానికి 248 కి.మీ. మైలేజీనిచ్చే 'లామినా' వండర్ కార్..!!

మీ కారు మైలేజ్ ఎంత ఇస్తుంది. మహా అయితే 10 కి.మీ. నుండి 20 కి.మీ వరకూ మైలేజిస్తుంది. అదే ఈ ఫోటోలో కనిపిస్తున్న కారు అయితే, ఏకంగా ఒక్క లీటర్ ఇంధనానికి 248 కి.మీ మైలేజీనిస్తుంది. ఏంటి నమ్మడం లేదా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నూటికి నూరుపాళ్లు నిజం.

కాలిఫోర్నియా పాలిటెక్నిక్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఓ ఇంజనీర్ల బృందం సృష్టించిన అద్భుతమే ఈ 'లామినా' కారు. ఇది ఒక్క గ్యాలన్ (1 గ్యాలన్ = 3.78 లీటర్లు) డీజిల్‌తో 584 మైళ్ల (1 మైలు = 1.609344 కి.మీ, అంటే మొత్తం 939.9 కి.మీ.) దూరం ప్రయాణించి రికార్డు సృష్టించింది. టెక్సాస్‌లోని హౌస్టన్‌లో నిర్వహించిన షెల్ ఎకో-మారథాన్‌లో ఈ కారును పరిచయం చేయటం జరిగింది.

ఇందులో ఓ మోడిఫై చేసిన హోండా జనరేటర్‌ను ఉపయోగించారు. సన్నగా, పొడవుగా ఉండే ఈ కారులో డ్రైవర్‌కు మాత్రమే చోటు ఉంటుంది. తక్కువ బరువు ఉండేలా డిజైన్ చేసిన దీని ఏరోడైనమిక్స్ కారణంగా ఇంత అధిక మైలేజ్‌ను సాధించటం వీలవుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. మన కార్లు కూడా ఈ కారు మాదిరిగా ఇంత మైలేజ్‌నిస్తే ఎంచక్కా పెట్రోల్/డీజిల్ సమస్యను మర్చిపోవచ్చు. మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Thursday, April 19, 2012, 19:02 [IST]
English summary
In what could be an answer to fuel scarcity, a team of engineers from the California Polytechnic State University has designed a vehicle that does a whopping 584mpg. Called the Lamina it was introduced at this year's Shell Eco-Marathon held in Houston, Texas.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+