సరమైన ధరకే సరికొత్త జైలోను విడుదల చేసిన మహీంద్రా

మహీంద్రా స్కార్పియో నుండి పొందిన 2.2 లీటర్ ఎమ్‌హాక్ ఇంజన్‌ను కొత్త జైలోలో ఆఫర్ చేయడమే కాకుండా, 2.5 లీటర్ ఎమ్ఈగల్, 2.5 లీటర్ ఎమ్‌డిఐ ఇంజన్‌లను ఈ మోడల్‌లో కంపెనీ ఆఫర్ చేస్తుంది. టాప్-ఎండ్ వేరియంట్ జైలోలో క్రూయిజ్ కంట్రోల్, వాయిస్ కంట్రోల్ సిస్టమ్, ల్యాప్‌టాప్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కొత్త 2012 జైలో మెగుగైన సస్పెన్షన్, 5-స్పీడ్ ట్రాన్సిమిషన్‌లతో డి2, డి4, ఈ4, ఈ8, ఈ9 అనే ఐదు వేరియంట్లలో లభిస్తుంది. డి2, డి4 వేరియంట్లలో మూడో వరసలోని సీట్లు పైక్కవైపుకు ఉంటాయి. ఈ రెండు వేరియంట్లు కూడా ఎమ్‌డిఐ ఇంజన్‌తో లభిస్తాయి. అలాగే ఈ4, ఈ8 వేరియంట్లో ఎమ్ఈగల్ ఇంజన్‌ను, టాప్-ఎండ్ వేరియంట్ అయిన ఈ9లో ఎమ్‌హాక్ ఇంజన్‌ను ఉపయోగించారు.
కొత్త 2012 మహీంద్రా జైలో ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
* మహీంద్రా జైలో డి2 - రూ.7.37 లక్షలు
* మహీంద్రా జైలో డి4 - రూ.7.77 లక్షలు
* మహీంద్రా జైలో ఈ4 - రూ.8.11 లక్షలు
* మహీంద్రా జైలో ఈ4 (ఏబిఎస్) - రూ.8.34 లక్షలు
* మహీంద్రా జైలో ఈ8 (ఏబిఎస్) - రూ.9.10 లక్షలు
* మహీంద్రా జైలో ఈ8 (ఏబిఎస్+ఎయిర్ బ్యాగ్స్) - రూ.9.47 లక్షలు
* మహీంద్రా జైలో ఈ9 - రూ.10.25 లక్షలు


Click it and Unblock the Notifications








