ఎక్సైజ్ డ్యూటీ పెంపు: రూ.94,000 మేర ధరలు పెంచిన హోండా
యూనియన్ బడ్జెట్ 2012-13లో ఎక్సైజ్ సుంఖాలను పెంచూ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెల్లడించిన తర్వాత ఆటోమొబైల్ కంపెనీలన్నీ వరుసగా తమపై పడిన అధనపు భారాన్ని వినియోగదారులపై మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హోండా సియోల్ కార్స్ ఇండియా (హెచ్ఎస్‌సిఐ) కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నామని ప్రకటించింది. హోండా అందిస్తున్న వివిధ మోడళ్లపై పెరిగిన ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
* హోండా బ్రయోపై రూ.4,000 నుండి రూ.10,000 వరకూ పెంపు.
* హోండా జాజ్‌పై రూ.15,000 వరకూ పెంపు.
* హోండా సిటీపై రూ.5,000 నుండి రూ.10,500 వరకూ పెంపు.
* హోండా సివిక్‌పై రూ.36,600 నుండి రూ.45,800 వరకూ పెంపు.
* హోండా అకార్డ్‌పై రూ.67,500నుండి రూ.93,975 వరకూ పెంపు.
అయితే, సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో హోండా అందిస్తున్న ఎస్‌యూవీ సిఆర్-వి ధర గురించి మాత్రం కంపెనీ ప్రస్తావించలేదు. పెరిగిన కొత్త ధరలు మార్చి 17, 2012 నుండి అమలులోకి వస్తాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. బడ్జెట్ భారంతో ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీల తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications









