మహీంద్రా చీప్ ఎక్స్‌యూవీ500ని విడుదల చేస్తుందా?
అయితే, ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే.. ప్రస్తుతం మహీంద్రా అందిస్తున్న ఎక్స్‌యూవీ500కు మార్కెట్లో అనూహ్య స్పందన ఉంది. ఈ మోడల్‌కు వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా ఉంది. ఇదే సమయంలో ఈ మోడల్ ఉత్పత్తి ప్రతి నెలా కేవలం 3,000 యూనిట్లకు మాత్రమే పరిమితమై ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం పెండిగ్‌లో ఉన్న ఎక్స్‌యూవీ500 డెలివరీలను క్లియర్ చేయడమే కష్టంగా ఉన్న మహీంద్రాకు, ఇందులో మరొక చౌక వేరియంట్‌ను విడుదల చేయడమంటే, మరింత అధనపు భారాన్ని తమ నెత్తిన మోపుకోవడమే అవుతుంది.
ఏదేమైనప్పటికీ, సమీప భవిష్యత్తులో కాకపోయినా ఎక్స్‌యూవీ500లో మహీంద్రా ఓ చౌక వేరియంట్‌ను తీసుకువస్తుందనటం ఖాయం. ఎందుకంటే, మహీంద్రా అండ్ మహీంద్రా వద్ద విస్తృత శ్రేణిలో ఇంజన్లను కలిగి ఉంది. స్కార్పియో, జైలో, బొలెరోలలో అమర్చే ఇంజన్లలో ఏదో ఒక ఇంజన్‌ను ఉపయోగించి కొత్త ఎక్స్‌యూవీ500 ధరను మరింత తగ్గించేందుకు మహీంద్రాకు అవకాశం ఉంది.
బడ్జెట్ 2012-13 తర్వాత పెరిగిన మహీంద్రా ఎక్స్‌యూవీ ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ6 - ధర రూ.11.38 లక్షలు
మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (ఫ్రంట్ వీల్ డ్రైవ్) - ధర రూ.12.79 లక్షలు
మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (ఆల్ వీల్ డ్రైవ్) - ధర రూ.13.81 లక్షలు


Click it and Unblock the Notifications









