బడ్జెట్ ఎఫెక్ట్: కార్ల ధరలను రూ.94,000 మేర పెంచిన స్కొడా
యూనియన్ బడ్జెట్ విడుదలైన తర్వాత కార్ల ధరలను పెంచిన కంపెనీల జాబితాలోకి స్కొడా ఆటో ఇండియా కూడా చేరిపోయింది. ప్రస్తుత బడ్జెట్‌లో కార్లపై ఎక్సైజ్ సుంఖాలను పెంచడం స్కొడా ఆటో ఇండియా కూడా తమ ఉత్పత్తుల ధరలను 2-5 శాతం మేర పెంచుతున్నామని కంపెనీ తెలిపింది. స్కొడా దేశీయ విపణిలో అందిస్తున్న చిన్న కారు ఫ్యాబియా మొదలుకొని లగ్జరీ కారు సూపర్బ్ వరకూ ధరలు పెరగనున్నాయి.
వివిధ మోడళ్లపై స్కొడా పెంచిన ధరలు ఇలా ఉన్నాయి.
* స్కొడా ఫ్యాబియాపై రూ.14,000 పెంపు.
* స్కొడా ర్యాపిడ్‌పై రూ.15,000 పెంపు.
* స్కొడా లారాపై రూ.32,000 పెంపు.
* స్కొడా యెటిపై రూ.43,000 పెంపు.
* స్కొడా సూపర్బ్‌పై రూ.94,000 పెంపు.
యూనియన్ బడ్జెట్ 201-13లో చిన్న కార్లపై ఎక్సైజ్ సుంఖాన్ని 10 శాతం నుండి 12 శాతానికి, పెద్ద కార్లపై ఎక్సైజ్ సుంఖాన్ని 22 శాతం నుండి 27 శాతానికి, దిగుమతి చేసుకున్న వాహనాలపై కస్టమ్ డ్యూటీని 60 శాతం నుండి 75 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే టాటా మోటార్స్, హోండా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి.


Click it and Unblock the Notifications









