నేటి సమ్మెను వాయిదా వేసుకున్న పెట్రోల్ పంప్ డీలర్లు
నేడు (ఏప్రిల్ 23, 2012) దేశవ్యాప్తంగా జరగాల్సిన పెట్రోల్ పంపు డీలర్ల సమ్మె వాయిదా పడింది. పెట్రోల్, డీజిల్ ఇంధనాలపై తమ కమిషన్‌ను పెంచాలని డిమాండ్ చేస్తూ, గడచిన వారంలో దేశంలోని సుమారు 40,000 లకు పైగా పెట్రోల్ పంపుల డీలర్లు ఈ సోమవారం సమ్మెను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
అయితే, పెట్రోల్ పంపు డీలర్ల డిమాండ్‌ను పరిశీలించేందకు కేంద్రం సానుకూలంగా వ్యవహరించడంతో సమ్మెను వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు కేంద్ర చమురుశాఖ మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి వీరి డిమాండ్లను పరిశీలించేందుకు ఒప్పుకోవడంతో సమ్మెను వాయిదా వేస్తున్నామని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా పెట్రోలియం ట్రేడర్స్ (ఎఫ్‌ఏఐపిటి) ఒక ప్రకటనలో పేర్కొంది.

ప్రతి లీటరు పెట్రోల్‌పై 27 పైసలు, ప్రతి లీటరు డీజిల్‌పై 14 పైసలు చొప్పన కమిషన్లను పెంచాలని పెట్రోల్ పంపుల డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. అపూర్వ చంద్ర కమిటీ ప్రతిపాధించిన దాని ప్రకారం, అధిక కమిషన్లను, వాహన టైర్లలో గాలిని నింపటం, త్రాగునీరు, టాయ్‌లెట్ల సౌకర్యాలను కల్పించటం వంటి సేవలపై యూజర్ చార్జీల యొక్క లెవీ (సుంఖం)ను విధించాలంటూ చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం అమలులోకి తీసుకురావాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రతి లీటరు పెట్రోల్‌పై రూ.1.49, ప్రతి లీటరు డీజిల్‌పై 91 పైసలు చొప్పును ప్రభుత్వం డీలర్ కమిషన్లను అందిస్తోంది. అపూర్వ చంద్ర కమిటీ నివేదికలో ఇప్పటి వరకు పెట్రోలు పంపుల్లో ఉచితంగా అందుబాటులో ఉంచిన సేవలు కార్లకు, మోటార్‌సైకిళ్లకు ఉచిత గాలి, టాయిలెట్లు, తాగునీరు వంటి సేవలపై కూడా చార్జీలు వసూలు చేసేందుకు అనుమతించాలని పేర్కొనబడింది.
దీని ప్రకారం, ప్యానెల్ పెట్రోలు పంపుల్లో ద్విచక్రవాహనాలకు గాలి నింపితే రూ.2 చొప్పున, అలాగే కారుకు రూ.5 చొప్పున ట్రక్కు లేదా బస్సుకు అయితే రూ.20 చొప్పున వసూలు చేయనున్నారు. అంతేకాకుండా వినియోగదారుడు టాయిలెట్‌ను వినియోగించుకుంటే రూ.2 వసూలు, మంచినీటిపై కనీస చార్జీలు తీసుకోవాలని కూడా ఈ కమిటీ సూచించింది.


Click it and Unblock the Notifications








