కార్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
లోనులో కొనుగోలు చేయాలనుకునే వారికి, ఒకరకంగా ఇది కాస్తంత ఊరట కలిగించే విషయమనే చెప్పవచ్చు. ఎందుకంటే, దేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బిఐ) కార్ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. ప్రస్తుతం మార్కెట్లో కార్ లోన్లు ఆఫర్ చేస్తున్న ఇతర బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీ రేటుకే ఎస్‌బిఐ కార్ లోన్లను అందిస్తోంది.
ఐసిఐసిఐ బ్యాంక్ 11.50 శాతం నుండి 14.75 శాతం మధ్యలో కార్ లోన్లను ఆఫర్ చేస్తుండగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 11.50 శాతం నుండి 12.25
శాతం మధ్యలో కార్ లోన్లను ఆఫర్ చేస్తుంది.

కాగా.. ఈ బ్యాంకుల కన్నా తక్కువకే, అంటే 11.25 శాతం వడ్డీ రేటుకే ఎస్‌బిఐ కార్ లోన్లను అందిస్తుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) ఇటీవల ప్రవేశపెట్టిన తన పాలసీ సమీక్షలో కీలక రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు (0.5 శాతం) తగ్గించిన నేపథ్యంలో వివిధ బ్యాంకులు కుడా రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎస్‌బిఐ కూడా వడ్డీ రేట్లను తగ్గించింది.
ఇప్పటికే ఐడిబిఐ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకు (పిఎన్‌బి)లు కూడా రుణాలపై పావు శాతం (25 శాతం) మేర వడ్డీ రేట్లను తగ్గించాయి.


Click it and Unblock the Notifications








