నిస్సాన్ సన్నీ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రెనో స్కాలా
అయితే, ఇప్పుడు తాజాగా నిస్సాన్ అందిస్తున్న సన్నీ సెడాన్‌ను రెనో కాపీ కొట్టి, పల్స్ మాదిరిగానే తమ బ్యాడ్జ్ క్రింద కాస్తంత అధిక ధరతో విక్రయించనుంది. ఈ సెడాన్‌కు "స్కాలా" అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుత సంవత్సరం ద్వితీయార్థంలో రెనో స్కాలా సెడాన్ మార్కెట్లోకి రానుంది.
రెనో భారత మార్కెట్లో ఫ్లూయెన్స్ సెడాన్ విడుదలతో ప్రీమియం కార్ మేకర్‌గా ప్రవేశించింది. తన ప్రీమియం మార్కును అలానే నిలబెట్టుకునేందుకు రెనో తన ఉత్పత్తులను కాస్తంత అధిక ధరకు విక్రయిస్తుంది. ప్రస్తుతం సన్నీ డీజిల్‌లో లభిస్తున్న 1.5 లీటర్ 97.6 బిహెచ్‌పి ఇంజన్‌నే స్కాలా సెడాన్‌లో కూడా రెనో ఉపయోగించనుంది.
ప్రస్తుతం రెనో అందిస్తున్న పల్స్ హ్యాచ్‌బ్యాక్ కేవలం డీజిల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఇందులో పెట్రోల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఇదే విధంగా, రెనో ప్రారంభంలో భాగంగా స్కాలా కూడా తొలుత డీజిల్ వేరియంట్, అనంతరం పెట్రోల్ వేరియంట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications









