జీతాలను ఐదు రెట్లు పెంచాలని మారుతి మానేసర్ వర్కర్ల డిమాండ్

త్వరలో ఖరారు చేయనున్న మూడేళ్ల వేతన సవరణ ఒప్పందం సందర్భంగా, తమ డిమాండ్లను పరిశీలించాలని కోరుతూ కొత్తగా 20 డిమాండ్లను, ఇటీవలే గుర్తింపు పొందిన కొత్త యూనియన్ మారుతి సుజుకి వర్కర్స్ యూనియన్ (ఎమ్ఎస్‌డబ్ల్యూయూ) కంపెనీ యాజమాన్యం ముందు ఉంచింది.
ఈ కొత్త యూనియన్ తమ డిమాండ్ల జాబితాను గతవారం యామాన్యానికి సమర్పించిందని, ఇందులో ప్రధానంగా మూలవేతనం పెంచాలని, కొన్ని కేసుల్లో దీని ఐదు రెట్ల వరకూ పెంచాలని వర్కర్లు డిమాండ్ చేస్తున్నారని కంపెనీ పేర్కొన్నాయి. అలాగే ప్రస్తుతం ఇచ్చే నిర్ణీత మొత్తంలో కాకుండా డియర్‌నెస్ అలవెన్స్ (డిఏ)ను మూలవేతనంతో కలపాలని వర్కర్లు కోరుతున్నట్లు సమాచారం.
దీని గురించి మారుతి సుజుకి వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సరబ్‌జీత్ సింగ్ మాట్లాడుతూ, ఈనెల 18న తమ డిమాండ్ల జాబితాను యాజమాన్యానికి అందజేశామని తెలిపే. అయితే, ఇందులో ఎలాంటి డిమాండ్లు ఉంచారనే విషయాన్ని వెల్లడించడానికి మాత్రం ఆయన నిరాకరించాడు. మారుతి సుజుకి కూడా ఈ విషయంపై పెదవి విప్పడం లేదు. ఈ డిమాండ్లకు యాజమాన్యం సానుకూలంగా స్పదింస్తే సరేసరి, లేకపోతే గతంలో జరిగినట్లు మానేసర్ ప్లాంటులో రచ్చ రచ్చ జరిగే ఆస్కారం ఉంది.


Click it and Unblock the Notifications








