రూ. 1,700 కోట్లతో గుర్గావ్‌లో డీజిల్ ఇంజన్ ప్లాంటు: మారుతి

గుర్గావ్‌లో ఏటా మూడు లక్షల డీజిల్ ఇంజన్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఓ ప్లాంటు నిర్మించడం కోసం రూ.1,700 కోట్లను వెచ్చించనున్నామని మారుతి సుజుకి ఇండియా ఛైర్మన్ ఆర్.సి. భార్గవ వెల్లడించారు. ఈ ప్లాంటులో 2013 మధ్యభాగం నాటికి ప్రారంభంలో భాగంగా 1.5 లక్షల డీజిల్ ఇంజన్ల ఉత్పత్తి సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభిస్తామని, 2014 నాటికి ఇది పూర్తిస్థాయిలో నిర్వహణలోకి వస్తుందని ఆయన తెలిపారు.
మొదటి దశలో భాగంగా రూ.950 కోట్ల పెట్టుబడులను వెచ్చిస్తామని, అనంతరం ఉత్పత్తిని రెట్టింపు చేసేందుకు మిగిలిన పెట్టుబడులను వెచ్చిస్తామని భార్గవ వివరించారు. బడ్జెట్‌లో డీజిల్ కార్లపై ప్రభుత్వం ఎలాంటి అధనపు సుంఖాలను విధించకపోవటంతో ఆటోమొబైల్ కంపెనీలు డీజిల్ టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం సుజుకి పవర్‌ట్రైన్, ఫియట్‌ల నుండి మారుతి సుజుకి డీజిల్ ఇంజన్లను కొనుగోలు చేస్తుంది.


Click it and Unblock the Notifications








