నిస్సాన్ ఉన్నత యాజమాన్యంలో కీలక మార్పులు

ప్రస్తుతం నిస్సాన్ ఇంటర్నేషనల్ ఎస్.ఏ., యూరప్‌లోని మ్యానుఫాక్చరింగ్, సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, పర్చేస్ విభాగాలకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఎస్‌విపి)గా ఉన్న ట్రెవోర్ మాన్న్‌ను ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇండియాల గ్లోబల్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, ఆపరేటింగ్ కమిటీలకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఎస్‌విపి)గా నియమిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుతం నిస్సాన్ మోటార్ ఆసియా పసిఫిక్ కో లి (ఎన్ఎమ్ఏపి), నిస్సాన్ మోటార్ (థాయ్‌లాండ్) కో లిమిటెడ్ కంపెనీలకు ప్రెసిడెంట్ మరియు ఆసియా అండ్ ఓషియానా ఆపరేషన్స్ రీజనల్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న టోరు హసెగవాను ఆఫ్రిక, మిడిల్ ఈస్ట్ అండ్ ఇండియా (ఏఎమ్ఐ)కు కార్పోరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నామని కంపెనీ తెలిపింది. ఈ స్థానాలతో పాటు మరికొన్ని కీలక స్థానాలను కూడా మార్పులు చేస్తున్నామని నిస్సాన్ పేర్కొంది.


Click it and Unblock the Notifications








