రాష్ట్ర మార్కెట్లోకి ప్రవేశించిన పోలారిస్ ఆఫ్-రోడ్ వాహనాలు

అమెరికాకు చెందిన ప్రముఖ ఆఫ్-రోడ్ వాహనాల తయారీ సంస్థ పోలారిస్ ఇండస్ట్రీస్ ఇప్పుడు రాష్ట్ర మార్కెట్లోకి ప్రవేశించింది. గడచిన శుక్రవారం అమీర్‌పేట్‌లోని మ్యారీగోల్డ్ హోటల్ లో ఆఫ్ రోడ్, ఆన్ రోడ్ మినీ పొలారిస్ వాహనాలను కంపెనీ విడుదల చేసింది. పొలారిస్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ దూబే ఈ వాహనాలను రాష్ట్ర మార్కెట్లో ఆవిష్కరించారు.

గడచిన సంవత్సరం ఆగస్టు నెలలో పోలారిస్ తొలిసారిగా భారత మార్కెట్లోకి ప్రవేశించి ఆఫ్-రోడ్ వాహనాలను విడుదల చేసింది. తొలి దశలో భాగంగా పోలారిస్ రాష్ట్ర మార్కెట్లో స్పోర్ట్స్ మ్యాన్ ఆల్-టెర్రైన్ వెహికల్స్ (ఏటివి), పోలారిస్ రేంజర్ ఆర్‌జెడ్ఆర్ సైడ్ బై సైడ్, స్నోమొబైల్స్ వంటి వాహనాలను అందిస్తుంది. పోలారిస్ వాహనాలకు హైదరాబాద్‌లో గారపాటి ఆటోవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారిక డీలర్‌గా వ్యవహరించనుంది.

వచ్చే ఐదేళ్లలో భారత్‌లో ఓ అసెంబ్లిగ్ ప్లాంటును ఏర్పాటు చేసి 400 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించాలని పోలారిస్ యోచిస్తోంది. భారత్‌లో పూర్తి అనుబంధ సంస్థగా కార్యకలాపాలు ప్రారంభించిన పోలారిస్ ఇక్కడ ఓ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి రానున్న 3-5 ఏళ్లలో హై-ఎండ్ మోటార్‌సైకిళ్ల, అలాగే, ఎలక్ట్రిక్ వాహనాలను భారత్‌లో విడుదల చేయాలని యోచిస్తోంది.

రాష్ట్ర మార్కెట్లో పోలారిస్ అందిస్తున్న ఆఫ్-రోడ్, ఆల్-టెర్రైన్ వాహనాల ధరల రూ. 2.86 లక్షలు నుండి ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఈ వాహనాలను అమెరికా, మెక్సికోలలో ఉన్న పోలారిస్ ప్లాంట్ల నుండి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్‌ (సిబియూ)గా దిగుమతి చేసుకొని దేశీయ మార్కెట్లో విక్రయించడం జరుగుతోంది. అయితే, భారత్‌లోనే వీటిని ఉత్పత్తి చేస్తే, ఇవి తక్కువ ధరకు లభించే అవకాశం ఉండటంతో, ఇక్కడ అసెంబ్లింగ్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు కంపెనీ మొగ్గు చూపుతోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, April 24, 2012, 14:17 [IST]
English summary
Leading off-road and all–terrain vehicle manufacturer Polaris India Private Ltd entered into Hyderabad market by launching their off-road vehicles. Polaris off-road vehicles price starts from Rs. 2.86 lakhs ex-shoroom Hyderabad.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+