కన్వర్టబిల్ ఎస్‌యూవీని డెవలప్ చేసిన ల్యాండ్ రోవర్
ప్రపంచంలోనే తొలి కన్వర్టబిల్ ఎస్‌యూవీను విడుదల చేసిన ఘనత జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కే దక్కింది. వచ్చే జనవరిలో జరగనున్న జెనీవా మోటార్ షోలో జేఎల్ఆర్ తమ రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టబిల్ ఎస్‌యూవీను ప్రదర్శించనుంది. విశాలమైన ఈ ఫోర్-సీటర్ కన్వర్టబిల్ ఆటో షోలో చూపరులను కట్టిపడేయనుంది. ఇందులో యాంత్రికంగా నియంత్రించబడే మెకానికల్ సాఫ్ట్ రూఫ్ ఉంటుంది.
డ్యాష్‌బోర్డులో ఓ బటన్‌ను ప్రెస్ చేయగాన్ టాప్ లేచిపోయి ఎస్‌యూవీ కాస్త కన్వర్టబిల్ ఎస్‌యూవీగా మారిపోతుంది. ఈ రూఫ్ ఎస్‌యూవీ వెనుక భాగంలో ఉండే బూట్ స్పేస్‌లోని ముడుచుకుని పోతుంది. ఈ రూఫ్ బరువు సుమారు 80 కిలోలు ఉంటుంది. ఇది స్టాండర్డ్ 3-డోర్ ఎవోక్‌లో ఉపయోగించే రూఫ్ కన్నా అధికం. ఒకవేళ ఇది ఉత్పత్తి దశకు చేరుకుంటే, రేంజ్ రోవర్ ఎవోక్‌లో ఇది మూడవ బాడీ స్టయిల్ కానుంది. ఇక దీని ధర విషయానికి వస్తే.. ఖచ్చితందా ఇతర వేరియంట్ల కన్నా అధికంగా ఉండే అవకాశం ఉంది.
ఆటోమొబైల్స్‌కు సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం మా ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్‌ను సందర్శించండి. http://www.facebook.com/drivespark
ఇప్పుడు ఆటోమొబైల్ వార్తలను మీ మొబైల్ ఫోన్‌లో కూడా పొందవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందిల్లా మీ మొబైల్ బ్రౌజర్‌లో http://m.drivespark.com/ వెబ్‌సైట్ అడ్రెస్ టైప్ చేయటమే.


Click it and Unblock the Notifications









