జేఎల్ఆర్‌లో 1,000 ఉద్యోగాలకు 35,000 అప్లికేషన్లు

జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్), ఈ పేరు వినగానే కళ్లు మిరుమిట్లు గొలిపే కాస్ట్లీ కార్లు మనకు గుర్తుకు వస్తాయి. ఈ కార్లను సొంతం చేసుకోవాలని చాలా మంది కల కంటుంటారు. ఈ కార్లను సొంతం చేసుకోవాలని కల కనే వారి ఈ కార్లను తయారు చేయడంలో తాము కూడా భాగస్వాముల కావాలని కలగనే వారే ఎక్కువగా ఉంటారని మీరు ఎప్పుడైనా ఊహించారా..?

అవును ఇది నిజం. జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్లాంటులో కేవలం 1,000 కొత్త ఉద్యోగాలు మాత్రమే ఉంటే ఇందుకు 35,000 మంది నుండి అప్లికేషన్లు వచ్చాయంటే, జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. యూకెలోని లివర్‌పూల్‌కు సమీపంలో ఉన్న జేఎల్ఆర్‌ హాలేవుడ్ ప్లాంటులో కంపెనీ కొత్తగా 1,000 మందిని వర్కర్లకు ఉద్యోగ అవకాశం కల్పించనుంది.

ఈ రిక్రూట్‌మెంట్ ప్రకటించిన మొదటి వారంలో సుమారు 20,000 ధరఖాస్తులు వచ్చి పడ్డాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 35,000 లకు పెరిగిందని జేఎల్ఆర్ పేర్కొంది. ఈ ప్లాంటులో తయారు చేస్తున్న రేంజ్ రోవర్ ఎవోక్, ఫ్రీలాండర్ 2 మోడళ్లకు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ పెరగడంతో వీటి ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు కొత్తగా సిబ్బందిని నియమించుకోవాలని జాగ్వార్ ల్యాండ్ రోవర్ నిర్ణయించింది.

కొత్త సిబ్బంది నియామకంతో ఈ ప్లాంటులో మొత్తం సిబ్బంది సంఖ్య 4,500 లకు చేరనుంది. గడచిన మూడేళ్ల క్రితం ఇదే ప్లాంటులో ఉన్న వర్క్‌ఫోర్స్‌తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు మూడు రెట్లు అధికం. దీన్ని బట్టి చూస్తుంటే జాగ్వాల్ ల్యాండ్ రోవర్‌ను కొనాలనుకునే వారి కన్నా, ఈ కార్లను తయారు చేయడంలో భాగస్వాములు కావాలనుకునే వారి సంఖ్యే అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 25, 2012, 18:22 [IST]
English summary
Jaguar Land Rover (JLR) saw a overwhelming response for the recent recruitment announcement. More than 35,000 people made online registrations for the new jobs at JLR's Halewood plant near Liverpool in UK.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+