డీజిల్‌పై నియంత్రణ ఎత్తివేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఇప్పటి వరకూ పెట్రోల్ ధరలపై మాత్రమే ప్రభుత్వం తమ నియంత్రణలు ఎత్తివేసింది. దీంతో పెట్రోల్ ధరలపై సర్వాధికారాలు చమురు కంపెనీల చేతుల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే దేశీయ మార్కెట్లో పెట్రోల్ ధరలు పెంచటం, ధరలు తగ్గితే దేశీయ మార్కెట్లో తగ్గించటం జరుగుతుంది.
అయితే ఎల్‌పిజి, కిరోసిన్, డీజిల్ ధరల నియంత్రణ మాత్రం ప్రస్తుతానికి ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. వీటిని సబ్సిడే ధరకే (మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే) విక్రయిస్తుండటం వలన చమురు కంపెనీలకు ఏర్పడే భారీ నష్టాలను ప్రభుత్వమే భరిస్తూ వస్తోంది. ఈ భారాన్ని తప్పించుకునేందుకు డీజిల్ ధరలపై నియంత్రణలను తొలగించాలని కేంద్ర యోచిస్తోంది.
ఇందులో భాగంగానే, డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణలు తొలగించేందుకు సర్కారు సూత్ర ప్రాయంగా అంగీకారాన్ని తెలిపింది. అయితే, ప్రస్తుతానికి వంటకు ఉపయోగించే ఎల్‌పిజిపై పూర్తిగా నియంత్రణ ఎత్తివేసే ఆలోచన లేదని మీనా పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ, డీజిల్ ధరలకు స్వేచ్ఛ కల్పించినప్పటికీ కూడా, సామాన్యుడిపై అధిక భారం పడకుండా ఉండేలా ధరలను తామే నిర్ణయిస్తామని ప్రభుత్వం అంటోంది. అంటే, త్వరలోనే డీజిల్ బాదుడుకు కూడా ముహుర్తం ఖరారైనట్లే అన్నమాట. మీరేమంటారు..?


Click it and Unblock the Notifications









