ఎర్టిగాను సాగదీసిన స్విఫ్ట్ అన్న ఆస్ట్రేలియన్ మీడియా

భారతదేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా రూపొందించి మొట్టమొదటి బహుళ ప్రయోజన వాహనం (ఎమ్‌పివి) ఎర్టిగాకు ఇటు ఇండియన్ మీడియా నుండి, ప్రజల నుండి మంచి సానుకల స్పందన లభిస్తే, అంతర్జాతీయ మీడియా నుండి ఎర్టిగాకు చేదు అనుభవం ఎదురైంది.

ఎర్టిగా విడుదలతో ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎల్‌యూవీ (లైఫ్ యుటిలిటీ వెహికల్) అనే ఓ కొత్త సెగ్మెంట్‌ను మారుతి సుజుకి సృష్టించింది. వాస్తవానికి మారుతి సుజుకి తమ ఎర్టిగా ఎమ్‌పివిని సరికొత్త కారుగా చెప్పుకుంటున్నప్పటికీ, స్విఫ్ట్, రిట్జ్ హ్యాచ్‌బ్యాక్ ఫ్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి ఎర్టిగాను రూపొందించిందని స్పష్టంగా తెలిసిపోతుంది.

ఆస్ట్రేలియాకు చెందిన ఓ ప్రముఖ ఆటోమోటివ్ జర్నలిస్ట్ ఎర్టిగాపై వ్యాఖ్యానిస్తూ.. ఇది సాగదీసిన స్విఫ్ట్ మాదిరిగా ఉందని కామెంట్ చేశాడు. మారుతి సుజుకి ఇప్పటికే స్విఫ్ట్ ఫ్లాట్‍ఫామ్ ఆధారంగా స్విఫ్ట్ డిజైర్ అనే సెడాన్‌ను రూపొందించిందని, ఇప్పుడు తాజాగా ఇదే ఫ్లా‌ట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఎర్టిగా ఎమ్‌పివిని డిజైన్ చేసిందని మాల్కన్ ఫ్లైన్ అనే ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ వ్యాఖ్యానించాడు.

మారుతి ఎర్టిగా స్విఫ్ట్ కన్నా 415 మి.మీ. పొడవుగా ఉంటుంది, అయితే వెడల్పు మాత్రం స్విఫ్ట్‌తో సమానంగానే (4695 మి.మీ.) ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఎర్టిగా మాత్రం తక్కువ ధరలో ఓ మంచి సౌకర్యవంతమైన యుటిలిటీ వాహనం కావాలనుకునే వారికి ఒక చక్కటి ఆప్షన్‌గా చెప్పవచ్చు.

మారుతి సుజుకి ఎర్టిగా పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో తొలిసారిగా కె-సిరీస్ 1.4 లీటర్ పెట్రోల్ వివిటి ఇంజన్‌ను ఉపయోగించారు. డీజిల్ వేరియంట్లో 1.3 లీటర్ డిడిఐఎస్ సూపర్‌టర్బో విజిటి డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఓ విలాసవంతమైన కారులో ఉండే ఇంటీరియర్ల అనుభూతినిచ్చేలా ఎర్టిగా ఎమ్‌పివి ఇంటీరియర్లను తీర్చిదిద్దారు. వెనుక కూర్చునే ప్యాసింజర్ల కోసం ఎర్టిగా రూఫ్‌పై అమర్చిన విశాలమైన ఎసి వెంట్స్, బీజ్ అండ్ లైట్ కలర్ ఇంటీరియర్ ప్లాస్టిక్స్, సెంట్రల్ కన్సోల్‌పై అమర్చిన 2-డిన్ ఆడియో సిస్టమ్ డ్యాష్‌బోర్డుకు మరింత అందమైన లుక్‌నిస్తుంది. 3-స్పోక్ స్టీరింగ్ వీల్, స్పోర్టీ గేర్ నాబ్ వంటి ప్రత్యేకమైన ఇంటీరియర్లు ఎర్టిగా ఎమ్‌పివి సొంతం.

More from DriveSpark

Article Published On: Thursday, April 26, 2012, 18:50 [IST]
English summary
The Maruti Suzuki Ertiga has had very positive responses from the Indian media and public since its launch. While Maruti Suzuki has said the Ertiga is a new car that will create a segment there are many who think The carmaker has just build a new car out of existing models.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+