సౌరశక్తితో నడిచే రిక్షాలను ప్రవేశపెట్టనున్న ఢిల్లీ

ఈ సమ్మర్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని సౌరశక్తితో నడిచే సైకిల్ రిక్షాలను ప్రవేశపెట్టాలని ఢిల్లీ సర్కారు భావిస్తోంది. రిక్షా పైభాగంలో అమర్చిన సోలార్ ప్లేట్లు సౌరశక్తిని విద్యుత్‌శక్తిగా మార్చి రిక్షాలో అమర్చిన బ్యాటరీలను చార్జ్ చేస్తుంది. సౌరశక్తితో నడిచే ఈ రిక్షాలు 25 కి.మీ. గరిష్ట వేగంతో పరుగులు పెడతాయి. ఇవి మూడు వేరియంట్లలో లభ్యం కానున్నాయి.
ప్లాస్టిక్ ఫ్రేమ్, అధిక మన్నికగల బ్యాటరీతో కూడిన రిక్షా ధర రూ.85,000 కాగా. కేవలం ప్లాస్టిక్ ఫ్రేమ్ (సాధారణ బ్యాటరీతో కలిపి) మాత్రమే కలిగిన రిక్షా ధర రూ.75,000 గానూ, మెటల్ ఫ్రేమ్ కలిగిన రిక్షా ధర రూ.45,000 గానూ ఉంది. మరి సూర్యుడు రాకపోయినట్లయితే ఈ రిక్షాల పరిస్థితి ఏంటనే సందేహం మీకు రావచ్చు. సౌరశక్తిని లేని సమయంలో దీనిని సాధరణ సైకిల్ రిక్షా మాదిరిగా పెడల్ సాయంతో తొక్కుతూ ఉపయోగించుకోవచ్చు.
ఈ సోలార్ పవర్డ్ రిక్షాలను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) సహకారంతో సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిఎమ్ఈఆర్ఐ) డిజైన్ చేసింది. వచ్చే జూన్ నాటికి ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో సుమారు 1,000 సోలార్ రిక్షాలను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








