ఈ ఏడాదిలోనే సిటీ డీజిల్ వేరియంట్: హోండా మోటార్స్

Honda City New
మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో గతం కొద్ది సంవత్సరాలుగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగిన హోండా సిటీ సెడాన్‌, ప్రస్తుతం ఈ సెగ్మెంట్లోకి కొత్తగా ప్రవేశిస్తున్న వివిధ మోడళ్ల కారణంగా గట్టి పోటీని ఎదుర్కోవలసి వస్తుంది. హోండా సిటీ సెడాన్ కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతుండటం కూడా ఇండియన్ మార్కెట్లో ఈ మోడల్ వైఫల్యానికి కారణమవుతుంది.

ఈ సెగ్మెంట్లో కొత్తగా ప్రవేశించిన ఫోక్స్‌వ్యాగన్ వెంటో, కొత్త ఫోర్డ్ ఫియస్టా, హ్యుందాయ్ వెర్నా వంటి వివిధ మోడళ్లు అటు పెట్రోల్ వేరియంట్లోనూ, ఇటు డీజిల్ వేరియంట్లో లభిస్తుండటం హోండా సిటీకు గోటిపుండుపై రోకలిపోటుగా మారింది. మరోవైపు కొనుగోలుదారులు కూడా పెరుగుతున్న పెట్రోల్ ధరలకు భయపడి డీజిల్ కార్లను కొనుగోలు చేస్తుండటం కూడా సిటీ అమ్మకాలపై ప్రభావం చూపుతుంది.

ఇప్పటి వరకూ హోండా సియోల్ కార్స్ ఇండియా లిమిటెడ్‌కు దేశీయ మార్కెట్లో డీజిల్ కార్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో. అయితే, ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన హోండా అతి త్వరలోనే దేశీయ విపణిలో డీజిల్ కార్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. హోండా నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న సిటీ సెడాన్‌లో కూడా డీజిల్ వేరియంట్‌ను విడుదల చేయాలని హోండా సన్నాహాలు చేస్తుంది.

ఇటీవల యూరప్‌లో జరిగిన ఓ ఆటో షోలో తమ ఇంజనీర్లు అభివృద్ధి చేసిన 1.6 లీటర్‌ డీజెల్‌ ఇంజన్‌‌ను హోండా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. గతంలో కంపెనీ తెలిపిన దాని ప్రకారం, తొలుతగా హోండా ప్రీమియం సెడాన్ సివిక్‌‌లో ఈ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని పేర్కొంది. కాగా.. మార్కెట్ సమాచారం ప్రకారం, ముందుగా హోండా సిటీలోనే డీజిల్ వేరియంట్ మార్కెట్లో విడుదలయ్యే ఆస్కారం ఉంది.

గడచిన డిసెంబర్ నెలలో హోండా సియోల్ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ 2012 వెర్షన్ హోండా సిటీ సెడాన్‌ను రూ.6.99 లక్షల ప్రారంభ ధరకే మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, హోండా సిటీని మరోసారి మార్పులు చేర్పులు చేసి కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువస్తామని సంస్థ డైరెక్టర్‌ సేకి ఇనాబా తెలిపారు. హోండా సిటీ డీజిల్ వేరియంట్ మార్కెట్లో విడుదలైతే, ఇక ఈ సెగ్మెంట్లో సిటీ సెడాన్‌కు తిరుగుండదు. మీరేమంటారు..??

More from DriveSpark

Article Published On: Monday, February 27, 2012, 10:50 [IST]
English summary
Japanese carmaker Honda planning to launch diesel version City this year, says reports. The city diesel car will give tough competition to Hyundai Fluidic Verna, Ford Global Fiesta, Volkswagen Vento cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+