13 లక్షల బిఎమ్‌డబ్ల్యూ కార్లలో ఎలక్ట్రిక్ సమస్యలు

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 లక్షల కార్లను బిఎమ్‌డబ్ల్యూ రీకాల్ చేసింది. 2003 నుండి 2010 మధ్య కాలంలో తయారైన బిఎమ్‌డబ్ల్యూ కార్లలో తలెత్తుతున్న ఎలక్ట్రిక్ సమస్యల కారణంగా ఈ రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కారులోని ట్రంక్‌లో కవర్ చేయబడిన ఓ లోపపూరితమైన బ్యాటరీ కేబుల్ కారణంగా కొన్ని ఎలక్ట్రిక్ సమస్యలు తలెత్తి, మంటలు చెలరేగే ప్రమాదం ఉన్నట్లు సమాచారం.

బిఎమ్‌డబ్ల్యూ రీకాల్ కార్లలో 5-సిరీస్, 6-సిరీస్ కార్లు ఉన్నాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సమస్యకు సంబంధించి ఇప్పటి వరకూ ఒక్క శాతం కార్లను కూడా పరిశీలించలేదని, ఈ ఎలక్ట్రికల్ సమస్య కారణంగా కార్లు అగ్నిప్రమాదానికి గురైనట్లు ఇంత వరకూ ఎలాంటి ఫిర్యాదులు అందలేదని కంపెనీ తెలిపింది. తమ వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ రీకాల్ చేస్తున్నామని బిఎమ్‌డబ్ల్యూ పేర్కొంది.

ఈ రీకాల్ గురించి తమ కస్టమర్లకు ప్రత్యేకంగా లేఖల ద్వారా తెలియజేస్తామని, రీకాల్‌కు వర్తించే మోడల్‌ను కస్టమర్లు తమ సమీపంలోని షోరూమ్‌కు తీసుకువెళితే 30 నిమిషాల నుండి ఒక్క గంట లోపే ఈ సమస్యను ఉచితంగా పరిష్కరించబడుతుందని కంపెనీ తెలిపింది. ఎక్కువ భాగం కార్లను అమెరికా, జర్మనీ, బ్రిటన్ చైనా దేశాలలో రీకాల్ చేయటం జరిగింది. అయితే, ఇండియాలో విక్రయించిన 5-సిరీస్, 6-సిరీస్ మోడళ్లు ఈ రీకాల్‌కు వర్తిస్తాయో లేదో అనే విషయాన్ని గురించి మాత్రం బిఎమ్‌డబ్ల్యూ ప్రస్తావించలేదు.

More from DriveSpark

Article Published On: Tuesday, March 27, 2012, 16:35 [IST]
English summary
BMW AG has announced a massive recall of 13 lakh cars after it found electrical problems in cars built between 2003 and 2010. According to reports there could be a defective battery cable cover in the trunk of the car that could lead to some electrical problems which could result in a fire.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+