ప్రస్తుతం సంవత్సరంలో 8-10 శాతం వృద్ధిని సాధిస్తాం: జిఎమ్

గడచిన 2006 సంవత్సరం నుండి ఇప్పటి వరకూ 1.5 లక్షల తవేరా మోడళ్లను విక్రయించామని, కేవలం గత సంవత్సరంలోనే 21,000 తవేరాలను, 45,000 బీట్ కార్లను, 22,000 స్పార్క్ మోడళ్లను విక్రయించామని ఆయన తెలిపారు. చెవర్లే బ్రాండ్ క్రింద జనరల్ మోటార్స్ ఇప్పటికే 2.25 లక్షల వాహనాలను విక్రయించింది. 8-10 శాతం వృద్ధిని సాధించగలమని, ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమ మాంద్యాన్ని ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఉత్పత్తి పెంపు జిఎమ్ దృష్టి సారించబోదని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications








