పెట్రోల్ ధరను భారీగా తగ్గించిన గోవా, మరి ఇతర రాష్ట్రాలో..?

Petrol Price Cut
పర్యాటక ప్రాంతానికి ప్రసిద్ధి గాంచిన గోవా పెట్రోల్ ధరలను భారీగా తగ్గించనుంది. గోవా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ 2012-13లో పెట్రోల్ ధరలను ప్రతి లీటరుపై ఏకంగా రూ.11 తగ్గించాలనే ప్రతిపాదను తీసుకువస్తున్నామని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీక్కర్ వెల్లడించారు. ఈ భారీ తగ్గింపుతో గోవాలో లీటరు పెట్రోల్ రూ.55 లకు దిగిరానుంది.

పెట్రోల్ ధరపై వ్యాట్ (వ్యాల్యూ యాడెడ్ టాక్స్)ను తగ్గించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. గోవా తీసుకున్న ఈ గొప్ప నిర్ణయంతో దేశంలోనే అత్యంత చవక ధరకే పెట్రోల్ విక్రయిస్తున్న రాష్ట్రంగా గోవా నిలువనుంది. విమానాలకు ఉపయోగించే ఇంధనంపై కూడా వ్యాట్‌ను తగ్గించాలని మనోహర్ రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిపాదించారు.

దీంతో అనేక విమానాలు గోవాలోనే పెట్రోల్‌ను ఫిల్ చేసుకునే ఆస్కారం ఉంది. గోవాకు సరిహద్దు రాష్ట్రాలయిన కర్ణాటక, మహారాష్ట్రల నుండి కూడా ప్రజలు గోవాకు వెళ్లి పెట్రోల్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఒక్కసారి ఈ బడ్జెట్ పాస్ అయితే ఈ ధరల తగ్గింపు ఐదేళ్ల పాటు అమలులో ఉంటుందని మనోహర్ ప్రకటించారు.

వాస్తవానికి పెట్రోల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణలు ఎత్తివేసిన తర్వాత, ఇది చమురు కంపెనీలు చేతిలోకి వెళ్లింది. అంతర్జాతీ మార్కెట్లో ముడి ధరల ప్రకారం ఇక్కడి మార్కెట్లో కూడా పెట్రోల్ ధరను తగ్గించడం, పెంచడం వంటివి చమురు కంపెనీలు చేస్తాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం, ప్రతి 15 రోజులకు ఒకసారి చమురు కంపెనీలు సమావేశమై పెట్రోల్ ధరలను సమీక్షించడం జరుగుతుంది.

అయితే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా, చమురు కంపెనీలు గడచిన డిసెంబర్ నెల నుండి పెట్రోల్ ధరల జోలికివెళ్లలేదు. ఈ నేపథ్యంలో గోవా తీసుకున్న నిర్ణయం పట్ల ఇతర రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. పెట్రోల్ ధరల విషయంలో గోవా రాష్ట్రాన్నే ఇతర రాష్టాలు కూడా ఫాలో అవుతాయా..? మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Tuesday, March 27, 2012, 14:52 [IST]
English summary
Goa chief minister Manohar Parikkar in his budget for 2012-13 has announced a massive cut in petrol prices. He has announced a Rs.11 reduction in petrol prices bringing the price down to Rs.55 per litre. This has been possible be reducing VAT charged on petrol. This will effectively make Goa the state which sell s the cheapest petrol in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+