ఇండియాలో 3,422 బిఎమ్‌డబ్ల్యూ కార్లు రీకాల్

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ బ్యాటరీ కేబుల్ సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా 13 లక్షల కార్లను రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఇండియాలో విక్రయించిన 3,422 కార్లు ఈ రీకాల్‌కు వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది. 2003 నుండి 2010 మధ్య కాలంలో తయారైన 5-సిరీస్, 6-సిరీస్ కార్లలో ఉపయోగించిన లోపపూరితమైన బ్యాటరీ కేబుల్‌ను రీప్లేస్ చేసేందుకు ఈ రీకాల్ చేస్తున్నట్ల కంపెనీ తెలిపింది.

కారులోని ట్రంక్‌లో కవర్ చేయబడిన ఓ లోపపూరితమైన బ్యాటరీ కేబుల్ కారణంగా కొన్ని ఎలక్ట్రిక్ సమస్యలు తలెత్తి, కారులో మంటలు చెలరేగే ప్రమాదం ఉన్న కారణంగా బిఎమ్‌డబ్ల్యూ ఈ రీకాల్ చేసింది. ఈ సమస్య కారణంగా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రమాదాలు జరిగినట్లు తమ దృష్టికి రాలేదని కంపెనీ పేర్కొంది. తమ వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ రీకాల్ చేస్తున్నామని బిఎమ్‌డబ్ల్యూ తెలిపింది.

ఈ రీకాల్ గురించి ఇండియాలోని తమ కస్టమర్లకు ప్రత్యేకంగా తెలియజేస్తామని, సమాచారం అందుకున్న వినియోగదారులు తమ వాహనాన్ని సమీపంలోని బిఎమ్‌డబ్ల్యూ షోరూమ్/సర్వీస్ సెంటర్‌కు తీసుకువెళితే 30 నిమిషాల నుండి ఒక్క గంట వ్యవధిలో ఈ సమస్యను ఉచితంగా పరిష్కరించబడుతుందని కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 28, 2012, 11:50 [IST]
English summary
BMW AG has announced a massive recall of 13 lakh 5-series and 6-series models built between 2003 and 2010 to fix a potential problem with a battery-cable cover. Out of this BMW calling back over 3,422 units in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+