వడ్డీ రేట్లను తగ్గించిన ఇండియన్ బ్యాంక్, ఐఓబి

తాజా తగ్గింపుతో రెండు బ్యాంకుల బేస్ రేటు 10.75 శాతం నుంచి 10.50 శాతానికి దిగొచ్చింది. ఈ కొత్త రేట్లు మే 1, 2012 నుంచి అమల్లోకి వస్తాయని ఈ బ్యాంకులు పేర్కొన్నాయి. ఈ రెండు బ్యాంకుల ద్వారా లోనులో కారు కొనుగోలు చేయాలనుకునే వారికి వడ్డీ రేట్లపై కాస్తంత ఊరట లభించనుంది.
కాగా.. ఇప్పటికే దేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బిఐ) కూడా వాహన రుణాలపై వడ్డీ రేట్లను 0.50 శాతం మేర తగ్గించగా, ఐడిబిఐ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకు (పిఎన్‌బి)లు కూడా రుణాలపై పావు శాతం (0.25 శాతం) మేర వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఐసిఐసిఐ బ్యాంక్ 11.50 శాతం నుండి 14.75 శాతం మధ్యలో కార్ లోన్లను ఆఫర్ చేస్తుండగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 11.50 శాతం నుండి 12.25 శాతం మధ్యలో కార్ లోన్లను ఆఫర్ చేస్తుంది. ఈ బ్యాంకులన్నింటికన్నా తక్కువ వడ్డీ రేటుకే అంటే 11.25 శాతం వడ్డీ రేటుకే ఎస్‌బిఐ కార్ లోన్లను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








