పెట్రోల్ ధర విషయంలో గోవాను ఫాలో కానున్న న్యూఢిల్లీ
ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర (మార్చి 28 నాటికి) రూ.65.64 లుగా ఉంది. ఒకవేళ దీనిపై రూ.15 తగ్గింపును అందించినట్లయితే లీటరు పెట్రోల్ కేవలం రూ.50.64 లకే లభ్యమవుతుంది. పెట్రోల్ ధరలను తగ్గించడంలో గోవా, ఢిల్లీ సర్కార్లు విజయం సాధిస్తే, కోల్‌కటాస బెంగుళూరు, ముంబై నగరాల్లో కూడా పెట్రోల్ ధరలకు కొండ దిగి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇదిలా ఉండగా, పెట్రోల్ ధరల తగ్గింపు విషయంలో గోవా పాటిస్తున్న విధానాలనే ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాలని, ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాలు ఈ చర్యలు తీసుకుని సామాన్యుడిపై భారం పడకుండా చూడాలని ఢిల్లీ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు.
గోవా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ 2012-13లో పెట్రోల్ ధరలను ప్రతి లీటరుపై రూ.11 తగ్గింపును అందించాలనే ప్రతిపాదను తీసుకువస్తున్నామని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీక్కర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పెట్రోల్ ధరపై వ్యాట్ (వ్యాల్యూ యాడెడ్ టాక్స్)ను తగ్గించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications









