మొక్కజొన్న స్ట్రాచ్‌తో కారు బాడీ ప్యానెల్స్ తయారీ: టాటా

అయితే, తాజాగా.. టాటా మోటార్స్‌కు చెందిన ఇంజనీర్ల బృందం మొక్కజొన్న నుండి వచ్చే ధృఢమైన పిండి పదార్థంతో కార్ల తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ పదార్థాన్ని ఉపయోగించి కారు బాడీ ప్యానెల్స్‌ను తయారు చేస్తారు. మొక్కజొన్నను ఇప్పటికే సిడి (కాంపాక్ట్ డిస్క్)ల తయారీలో ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పదార్థం ధృఢమైనదే కాకుండా అగ్నికి కూడా అంటుకోదు.
మొక్కజొన్న నుండి సేకరించే ఈ పదార్థం అధిక ధృఢత్వాన్ని, ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉండి మంచి భద్రతను కల్పిస్తుంది. ఇది తేలిక ఉండటం కారణంగా కారు బరువును తగ్గించి తద్వారా మైలేజీని పెంచేందుకు సహకరిస్తుంది. ఇప్పటికే ఈ తరహా పదార్థాన్ని ఇతర కంపెనీలు తమ కార్లలో ఉపయోగించి ప్రయోగిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి టాటా మోటార్స్ దీన్ని పూర్తిస్థాయిలో ఉత్పత్తిలోకి తీసుకురావాలని యోచిస్తోంది.


Click it and Unblock the Notifications








