నాగ్‌పూర్‌లో కొత్త షోరూమ్‌ను ప్రారంభించిన ఆడి ఇండియా

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా, భారత్‌లో మరో కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. భారత మార్కెట్లో తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకునే దిశలో భాగంగా నాగ్‌పూర్‌లో షోరూమ్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆడి ఇండియా తెలిపింది. ఈ షోరూమ్‌ను ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ, ఆఢి నాగ్‌పూర్ (జైకా వెహికల్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్) మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ కాలేలు ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తార నేహా దూపియా కూడా హాజరయ్యింది. మొత్తం 9684 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ షోరూమ్ నాగ్‌పూర్‌లోనే అతి లగ్జరీ కార్ పెద్ద షోరూమ్. ఈ షోరూమ్‌లో 10 కార్లను డిస్‌ప్లే చేయవచ్చు. ఆడి ఇండియా దేశీయ మార్కెట్లో అందిస్తున్న అన్ని ఉత్పత్తులను ఈ షోరూమ్‌లో ప్రదర్శించేంత స్థలం ఉంటుంది. అంతేకాకుండా ఎమ్‌ఐడిసి హింగ్నాలో 30,000 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సర్వీస్ సెంటర్‌ను కూడా ఆడి నాగ్‌పూర్ నిర్వహిస్తోంది.

అంతేకాకుండా.. ఆడి బ్రాండ్ వస్తువులను కొనుగోలు చేసేందుకు, కస్టమైజ్డ్ ఆడి ఉత్పత్తులను ఆర్డర్ చేసేందుకు ఆడి షాప్, ఆడి ఎక్స్‌క్లూజివ్ ఫెసిలిటీలను కూడా ఈ షోరూమ్ నిర్వహిస్తోంది. 2012 చివరి నాటికి దేశవ్యాప్తంగా 25 డీలర్‌షి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆడి ఇండియా లక్ష్యంగా పెటుకుంది. వచ్చే నెలలో భోపాల్, కోయంబత్తూర్, ఢీల్లీ వెస్ట్ వంటి ప్రాంతాల్లో షోరూమ్‌లను ఏర్పాటు చేయనుంది.

More from DriveSpark

Article Published On: Friday, March 30, 2012, 13:08 [IST]
English summary
The German luxury car manufacturer Audi India, has opened a showroom in Nagpur. The Audi Nagpur showroom was inaugurated by Mr. Michael Perschke, Head, Audi India and Mr. Gautam Kale, Managing Director, Audi Nagpur.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+