భారీ నష్టాలను మూటగట్టుకున్న మారుతి సుజుకి

కొత్త కార్ల విడుదలతో జోరు మీదున్న దేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) గడచిన ఆర్థిక సంవత్సరం మాత్రం చేదు ఫలితాలనే మిగిల్చింది. అయితే, నాల్గవ త్రైమాసికం మాత్రం ఆశించిన దానికన్నా ఫర్వాలేదనిపించింది. గడచిన ఆర్థిక సంవత్సరం (2011-12)లో మార్చి 31, 2012తో ముగిసిన నాల్గవ త్రైమాసికానికి మారుతి సుజుకి లాభాలు 3.04 శాతం క్షీణించి రూ.639.8 కోట్లకు పడిపోయాయి. గడచిన సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ లాభాలు 659.9 కోట్లుగా ఉన్నాయని ఎమ్ఎస్ఐ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ త్రైమాసికంలో కంపెనీ నికర అమ్మకాలు రూ.11,486.4 కోట్లుగా నమోదు కాగా, అంతకు ముందు ఇదే కాలానికి నికర అమ్మకాలు 9,796.7 కోట్లుగా ఉన్నాయి. మొత్తమ్మీద 2011-12 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ28.6 శాతం క్షీణించి రూ.1,635.1 కోట్లుగా నమోదైంది. 2010-11 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ.2,288.7 కోట్లుగా ఉంది. అయితే, అమ్మకాలు మాత్రం జోరుగానే ఉన్నాయి. 2012తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు రూ.37,705.9 కోట్లుగా ఉండగా, అంతకు ముందు ఏడాది ఇది రూ.35,849 కోట్లుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, April 30, 2012, 13:10 [IST]
English summary
India's leading carmaker maruti suzuki had a 3 per cent fall in fourth net quarter profit. However, the company beat estimates with a smaller-than-expected 3 percent fall. The fall in profit can be accounted to the carmakers sluggish sales growth and tighter margins.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+