ప్రీ-ఓన్డ్ కార్ మార్కెట్లో శాంత్రో, సిటీలకు పెరుగుతున్న డిమాండ్!
తాజా మార్కెట్ నివేదికల ప్రకారం, సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో శాంత్రో, సిటీ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మార్కెట్లో 2001 నుండి 2010 మోడళ్లకు చెందిన శాంత్రో కార్లు రూ.1 లక్షల నుండి రూ.3 లక్షల ధరల శ్రేణిలో లభ్యమవుతున్నాయి. ఇకపోతే 2004-05 మోడల్‌కు చెందిన సెకండ్ జనరేషన్ పెట్రోల్ వెర్షన్ సిటీ సెడాన్ ధర రూ.3.5 లక్షల నుండి రూ.4.5 లక్షల ధరల శ్రేణిలో లభ్యమవుతున్నాయి.
కొత్త కార్ మార్కెట్లో గడచిన కొద్ది నెలలుగా చోటు చేసుకున్న మార్పులను గమనిస్తే, పెట్రోల్ కార్ల కన్నా డీజిల్ కార్లకే అధిక డిమాండ్ ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో కూడా పెట్రోల్ కార్ల కన్నా డీజిల్ కార్లకే మంచి డిమాండ్ ఉంటుందని సెకండ్ హ్యాండ్ కార్ డీలర్లు చెబుతున్నారు. సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో డీజిల్ కార్ల లభ్యత తక్కువగా ఉందని, డీజిల్ కార్లకు ఇంత హఠాత్తుగా డిమాండ్ పెరగడంతో సరైన డీజిల్ కార్లను పొందలేకపోతున్నామని డీలర్లు అంటున్నారు.


Click it and Unblock the Notifications









