పెట్రోల్ ఎతియోస్, లివాలు మాత్రమే ఎగుమతి చేస్తాం: టొయోటా

టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టికెఎమ్) దేశీయ విపణిలో అందిస్తున్న మొట్టమొదటి చిన్న కారు ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్‌, ఎతియోస్ సెడాన్‌లు ఇకపై విదేశీ మార్కెట్లో కూడా లభ్యం కానున్నాయి. మేడ్ ఇన్ ఇండియా ఎతియోస్, లివా కార్లను దక్షిణాఫ్రికా దేశానికి ఎగుమతి చేయాలని కంపెనీ నిర్ణయించింది. వచ్చే నెల (ఏప్రిల్ 2012) నుండి ఈ రెండు కార్లు ఇండియా నుండి ఎగుమతి కానున్నాయి.

ఇండియన్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా దేశీయ వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా టొయోటా ఈ రెండు మోడళ్లను డిజైన్ చేసింది. అయితే, ఎగుమతి చేయనున్న ఈ మోడళ్లలో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇండియాలో తయారవుతున్న ఎతియోస్, లివా ఫ్లాట్‌ఫామ్‌ల ఆధారంగానే ఎగుమతి మోడళ్లను డిజైన్ చేస్తున్నప్పటికీ, స్థానిక డిమాండ్‌కు అనుగుణంగా ఫీచర్లు, స్పెసిఫికేషన్లలో కొద్దిపాటి మార్పులు ఉంటాయి.

దక్షిణాఫ్రికాలో కుడి చేతి వాటం (రైట్ హ్యాండ్) డ్రైవ్ కలిగిన మార్కెట్లో ఎతియోస్, లివా కార్లు ఎగుమతి కానున్నాయి. టొయోటా ఎగుమతి చేయనున్న ఎతియోస్, లివా మోడళ్లలో కేవలం పెట్రోల్ వేరియంట్లను మాత్రమే ఎగుమతి చేయనుంది. ప్రస్తుతం ఈ రెండు మోడళ్లు కూడా బెంగుళూరులోని ప్లాంటులో తయారవుతున్నాయి.

టొయోటా ఇటీవలే ఈ ప్లాంటు సామర్థ్యాన్ని సాలీనా 80,000 యూనిట్ల నుండి 1,20,000 యూనిట్లకు పెంచడం జరిగింది. ఇంజన్, గేర్‌బాక్సులను టొయోటా ఇండియాలోనే తయారు చేయటం ప్రారంభించిన తర్వాత బ్రెజిల్, థాయ్‌లాండ్ వంటి మార్కెట్లకు సైతం ఈ మోడళ్లను ఎగుమతి చేసే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 31, 2012, 15:22 [IST]
English summary
Toyota Kirloskar Motors (TKM) will start exporting its Etios brand cars from India to South Africa in April. Toyota will export only the petrol variants to the right hand drive market of SA from the Bangalore facility.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+