జోరుగా సాగుతున్న యమహా స్పోర్ట్స్ బైక్ అమ్మకాలు

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్స్ దేశీయ విపణిలో అందిస్తున్న వివిధ మోడళ్లకు మంచి డిమాండ్ లభిస్తుండటంతో గడచిన నెలలో కూడా అమ్మకాలు జోరుగా సాగాయి. మార్చి 2012 నెలలో దేశీయ మార్కెట్లో 15.6 శాతం అమ్మకాల వృద్ధిని సాధించామని ఇండియా యమహా మోటార్ ఓ ప్రకటనలో పేర్కొంది.

మార్చి 2011లో 25,786 యూనిట్లను విక్రయించగా, ప్రస్తుత సంవత్సరం మార్చి నెలలో 29,819 యూనిట్లను విక్రయించామని యమహా వెల్లడించింది. ఇదే సమయంలో ఎగుమతులు కూడా 10,982 యూనిట్ల నుండి 12,067 యూనిట్లకు పెరిగాయి. గడచిన సంవత్సరంతో పోలిస్తే మొత్తమ్మీద మార్చి 2012 నెలలో కంపెనీ మొత్తం అమ్మకాలు (ఎగుమతులు, దేశీయ అమ్మకాలు కలిపి) 36,768 యూనిట్ల నుండి 41,886 యూనిట్లకు పెరిగి 13.9 శాతం వృద్ధిని సాధించాయి.

డీలక్స్, ప్రీమియం సెగ్మెంట్లో తాము అందిస్తున్న వైజెడ్‌ఎఫ్-ఆర్15 వెర్షన్ 2.0, ఎఫ్‌జెడ్ సిరీస్, ఎస్‌జెడ్ సిరీస్ మోడళ్లకు మార్కెట్లో మంచి స్పందన లభిస్తోందని, సేల్స్, సర్వీస్, స్పేర్స్ విషయంలో ఉత్తమమైన సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, రానున్న రోజుల్లో టైర్-2, టైర్-3 నగరాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ తమ సబ్-డీలర్లను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నామని ఇండియా యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ హిరోయుకి సుజుకి తెలిపారు.

More from DriveSpark

Article Published On: Saturday, March 31, 2012, 16:50 [IST]
English summary
riggered by the success of its celebrated product line-up as well as an upturn in consumer sentiment, India Yamaha Motor has registered a growth of 15.6 % in domestic sales during March 2012 as compared to the corresponding period last year. It sold 29,819 units in March 2012 as against 25,786 units sold in March 2011 in the domestic markets.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+