కారునే పుచ్చకాయ్ రంగులో మార్చేసుకున్న ఘనుడు
వేసవిలో పుచ్చకాయలు (వాటర్‌మెలన్) తినడమంటే అందరికీ ఇష్టమే. కానీ కారునే పుచ్చకాయ మాదిరిగా మార్చుకునేంత ఇష్టం బహుశా ఎవరకీ ఉండకపోవచ్చేమో. ఈ ఫోటోలో కనిపిస్తున్న కారును చూడండి. అచ్చం పుచ్చకాయను తలపించేలా ఈ కారును మోడిఫై చేశారు.
చైనాలోని ఓ కార్ ప్రియడు (పుచ్చకాయల ప్రియుడు అనచ్చేమో) తన కారును ఇలా పుచ్చకాయ రంగులో మార్చేసి పుచ్చకాయలపై తన ప్రేమన వ్యక్తం చేసుకున్నాడు. కారు ఫ్రంట్ బంపర్ నుంచి రియర్ బంపర్ వరకూ చారలుగా ఉండే పుచ్చకాయ మాదిరిగా పెయింట్ చేయించాడు.

అలాగే కారు ఇంటీరియర్‌ను పుచ్చకాయ లోపలి వైపు ఎరుపు రంగు, నలుపు రంగుల (విత్తనాలు) కలయికతో డిజైన్ చేశారు. కారు లోపలి వైపు ఫ్లోర్ మ్యాట్లు మొదలుకొని టాప్ రూఫ్ వరకూ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేశారు. డోర్ హ్లాండిల్స్, డ్యాష్ బోర్డ్ వంటివి నలుపు రంగులో డిజైన్ చేశారు. బాగుంది కదూ ఈ పుచ్చకాయ్ కారు..!


Click it and Unblock the Notifications








