రాణీ ముఖర్జీకి రూ.1.25 కోట్ల కారును కానుకగా ఇచ్చిన ఆదిత్యా చోప్రా

ఓ ప్రముఖ నిర్మాత ఆ స్టార్ హీరోయిన్‌పై కన్నేశాడు. ఏలాగైనా ఆమెను తన సొంతం చేసుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. అంతేకాదు.. కోట్ల రూపాయల విలువ చేసే కానుకలతో సదరు సుందరాంగిని సంబరాల్లో ముంచేస్తున్నాడు. ఇదంతా ఎవరి గురించా అని ఆలోచిస్తున్నారా..?

అసలు విషయం ఏంటంటే, ప్రముఖ బాలీవుడ నిర్మాత, దర్శకుడు ఆదిత్యా చోప్రా (యష్ రాజ్ ఫిలిమ్స్ యజమాని), ప్రముఖ బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీపై కన్నేశాడు. సినీ పరిశ్రమలో గత కొద్ది కాలంగా వీరిద్దరి ప్రేమ ప్రయాణం గురించి గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆదిత్యా చోప్రాకు ఇప్పటికే ఒకసారి పెళ్లయ్యి, మొదటి భార్యతో విడాకులు తీసుకోవం కూడా జరిగింది. గడచిన సంవత్సరంలోనే వీరిద్దరికీ రహస్యంగా వివాహ నిశ్చితార్థం జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి.


అయితే, తాజాగా.. రాణీ ముఖర్జీని తన వైపుకు మరింతగా ఆకట్టుకునేందుకు ఆదిత్యా చోప్రా రూ.1.25 కోట్ల ఖరీదు చేసే కాస్ట్లీ కానుకతో ఈ ముద్దుగుమ్మను సంబరంలో ముంచెత్తినట్లు సమాచారం. జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ తాజాగా భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన సరికొత్త లగ్జరీ కారు ఆడి ఏ8 డబ్ల్యూ12 (ధర సుమారు రూ.1.25 కోట్లు)ను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఓ ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం, ఆదిత్యా చోప్రా మంగళవారం సాయంత్రం రాణీ ముఖర్జీ బంగ్లాకు ఆడి ఏ8 లగ్జరీ కారులో విచ్చేసి, ఆ కారులో ఆమెకు ఓ రైడ్‌ను ఆఫర్ చేసి అలా అలా నగర వీధులపై సరదాగా చక్కర్లు కొట్టి, తిరిగి ఆమెను బంగ్లాలో డ్రాప్ చేసి, లగ్జరీ కారును అక్కడే ఆమె బంగ్లా వద్ద వదలేసి, తన డ్రైవర్ తెచ్చిన కారులో వెళ్లిపోయాడట. ఈ ఏడాది చివరి నాటికి వీరద్దరికి వివాహం జరగొచ్చనే పుకార్లు కుడా వినిపిస్తున్నాయి.

ఆడి ఏ8 లగ్జరీ సెలూన్ విషయానికి వస్తే, జర్మనీ లగ్జరీ కార్ మేకర్ అందిస్తున్న ఈ ప్రీమియం కారు పూర్తిగా విలాసవంతమైన ఫీచర్లతో రూపొందించబడిన శక్తివంతమైన కారు ఇది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ ఆడి ఏ8 కారు 4.2 లీటర్ ఎఫ్ఎస్ఐ క్వట్టారో ఇంజన్‌తోనూ, డీజిల్ వేరియంట్ ఆడి ఏ8 3.0 లీటర్ టిడిఐ ఇంజన్‌తోనూ లభిస్తుంది.

భారత మార్కెట్లో ఆడి ఏ8 ఎల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* ఆడి ఏ8 ఎల్ 3.0 టిడిఐ క్వెట్టారో - రూ.76,85,000
* ఆడి ఏ8 ఎల్ 4.2 ఎఫ్ఎస్ఐ క్వెట్టారో - రూ.89,00,000
* ఆడి ఏ8 ఎల్ 4.2 టిడిఐ క్వెట్టారో - రూ.98,65,000
* ఆడి ఏ8 ఎల్ డబ్ల్యూ12 క్వెట్టారో - రూ.1,26,00,000

More from DriveSpark

Article Published On: Friday, July 27, 2012, 11:07 [IST]
English summary
Bollywood beauty Rani Mukerjee has been gifted a brand new Audi A8 w12 sedan by her close friend and director/producer Aditya Chopra. Rani Mukerjee is not the first Bollywood personality to have this car. Abhishek Bachchan had bout the A8 soon after his daughter's birth.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+