అమ్మకానికి మిగిలిన చివరి ఆస్టన్ మార్టిన్ వన్-77 కారు
వన్-77 కారును తొలిసారిగా 2009లో జరిగిన జెనీవా మోటార్ షోలో ఆస్టన్ మార్టిన్ ఆవిష్కరించింది. ఉత్పత్తి అయిన 77 కార్లలో ఇప్పటికే 76 కార్లు అమ్ముడైయిపోయాయి. ఇక ఒక్క కారు మాత్రమే మిగిలి ఉంది. ఆఖరి వన్-77 కారు ఫ్లోరిడాలో అమ్మకానికి ఉంది.
ఆస్టన్ మార్టిన్ వన్-77 కారులో 7.3 లీటర్ వి12 ఇంజన్ను ఉపయోగించారు. ఇది 750 బిహెచ్‌పిల శక్తిని, 750 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. వన్-77 కారు బరువును తక్కువగా ఉంచేందుకు గానూ దీని బాడీని లైట్‌వెయిట్ హ్యాండ్‌మేడ్ అల్యూమినియం ప్యానెల్స్‌తోనూ, కార్బన్ ఫైబర్‌తోనూ రూపొందించారు.
ఆస్టన్ మార్టిన్ కంపెనీ గురించి:
ఆస్టన్ మార్టిన్ కంపెనీకు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలలో ఉత్పత్తి కేంద్రాలున్నాయి. వీటి ద్వారా ఏటా 8,000 కార్లను మాత్రమే కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ఆస్టన్ మార్టిన్‌కు 42 దేశాల్లో 134 డీలర్లు ఉన్నారు. లియోనెల్ మార్టిన్ 1914లో మరియు రాబెర్ట్ బామ్‌ఫోర్డ్‌లు ఆస్టన్ మార్టిన్ స్థాపించారు. 1994 నుంచి 2007 వరకూ ఈ కంపెనీ అమెరికాకు చెందిన కార్ల తయారీ సంస్థ ఫోర్డ్‌లో భాగంగా ఉండేది.
2007లో ఆస్టన్ మార్టిన్ కంపెనీ ఫోర్డ్ నుండి విడిపోయింది. గడచిన సంవత్సరంలో ఆస్టన్ మార్టిన్ అందిస్తున్న సిగ్నెంట్ మినహా బేసిక్ మోడల్ వీ8 వ్యాంటేజ్ నుంచి ఆల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ కారు వన్-77 వరకూ అన్ని మోడళ్లను భారత్‌కు పరిచయంచేసింది. ఆస్టన్ మార్టిన్ వన్-77 కారు ప్రస్తుతం భారత్‌లోనే అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కారు.


Click it and Unblock the Notifications









