హ్యుందాయ్‌ను వదలి ఫోక్స్‌వ్యాగన్‌లో చేరిన సక్సేనా

ఇటీవలి కాలంలో ఆటోమొబైల్ రంగంలో పలువురు ఉన్నతాధికారులు ప్రస్తుతం తాము పని చేస్తున్న సంస్థలను వదిలిపెట్టి ఇదే రంగంలోని అభివృద్ధి చెందుతున్న సంస్థలలో చేరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. దేశపు ద్వితీయ అగ్రగామి కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియాలో మార్కెటింగ్ హెడ్ విధులు నిర్వహిస్తూ వచ్చిన అరవింద్ సక్సేనా ఇప్పుడు జర్మన్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ చెంతకు చేరారు.

జర్మనీకు చెందిన కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ భారతీయ యూనిట్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా అరవింద్ సక్సేనా ఎన్నికయ్యారు. ఈ మేరకు అరవింద్ సక్సేనాను ఇండియాలోని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ విభాగాని మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించుకుంటున్నామని కంపెనీ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ ప్రెసిడెంట్ జార్జ్ డోరియాస్‌ పేర్కొన్నారు.

ఉత్తమ మార్కెటింగ్ ప్రణాళికలతో హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీను అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్లిన అరవింద్ సక్సేనా, తమ కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించగలరని ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ధీమా వ్యక్తం చేసింది. ఈ రంగంలో సక్సేనాకు 30 ఏళ్లకు పైగా అనుభం ఉంది. ఈయన నేతృత్వంలో కంపెనీ అమ్మకాలను మరింత వృద్ధిని సాధించగలవని డోరియాస్ అన్నారు.

ఈ సందర్భంగా అరవింద్ సక్సేనా మాట్లాడుతూ.. ఫోక్స్‌వ్యాగన్‌లో భాగం పంచుకోవడానికి తనకెంతో సంతోషంగా ఉందని, ఈ రంగంలో మరిన్ని కొత్త సవాళ్లను ఎదుర్కుని ఫోక్స్‌వ్యాగన్‌ అభివృద్ధిలో పాలుపంచుకుంటానని చెప్పారు. సక్సేనా హ్యుందాయ్ మోటార్ ఇండియాలో పనిచేయడానికి ముందు మారుతి సుజుకి ఇండియా కంపెనీలో కూడా విధులు నిర్వహించారు.

More from DriveSpark

Article Published On: Thursday, August 23, 2012, 13:00 [IST]
English summary
German carmaker Volkswagen has announced the appointment of Arvind Saxena as the managing director of Volkswagen Passenger Cars in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+