వాణిజ్య వాహనాల ధరలను తగ్గించిన అశోక్ లేలాండ్

ఈ ధరల తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని అశోక్ లేలాండ్ తెలిపింది. షాషీలపై ఎక్సైజ్ సుంకాన్ని 15 శాతం నుంచి 14 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కస్టమర్లపై కొంత భారాన్ని తగ్గించాలని భావించామని, అందుకే వాణిజ్య వాహనాల ధరలను కూడా ఒక శాతం మేర తగ్గిస్తున్నామని అశోక్ లేలాండ్ పేర్కొంది.
ఈ ఏడాది మార్చి నెలలో ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2012-13లో సర్కారు వాణిజ్య వాహనాల ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడంతో అశోక్ లేలాండ్ కంపెనీ ఈ నెల ఆరంభంలో ధరలను 5 శాతం వరకూ పెంచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, అశోక్ లేలాండ్-నిస్సాన్ దోస్త్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన ప్యాసింజర్ వాహనాన్ని త్వరలోనే మార్కెట్లోకి తెస్తామని హిందూజా ఆటోమోటివ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వి.సుమంత్రన్ గతంలో తెలిపారు. అంతేకాకుండా ఏ ఏడాదిలోనే దోస్త్ ఎల్‌సీవీలో ఓ సీఎన్‌జీ వెర్షన్ అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








