అమ్మకాల్లో అదరగొడుతున్న ఆడి; మార్చిలో 'టిటి' విడుదల

అమ్మకాల పరంగా భారత మార్కెట్లో అదరగొడుతున్న ఆడి ఇండియా, ఈనెలలో మరో సరికొత్త కారును దేశీయ మార్కెట్లో విడుదల చేయనుంది. మరికొద్ది రోజుల్లో 'ఆడి టిటి' మోడల్‌ను విడుదల చేస్తామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆడి టిటి విడుదల తర్వాత క్యూ3 ఎస్‌యూవీని, స్పోర్టీ ఆడి ఎస్6 మోడళ్లను విడుదల చేస్తామని ఆడి ఇండియా తెలిపింది. గడచిన సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 13 లక్షల కార్లను విక్రయించగా, భారత్‌లో 5,511 కార్లను విక్రయించామని కంపెనీ తెలిపింది.

కాగా.. ఫిబ్రవరి 2012లో ఆడి ఇండియా భారత మార్కెట్లో 600 కార్లను విక్రయించి, గతేడాది ఇదే నెల అమ్మకాలతో పోలిస్తే 33 శాతం వృద్ధి తన ఖాతాలో వేసుకుంది. ఫిబ్రవరి 2011లో ఆడి ఇండియా 450 కార్లను విక్రయించింది. ఆడి ఇండియా ప్రస్తుతం భారత మార్కెట్లో.. ఏ4, ఏ6, ఏ7 స్పోర్ట్‌బ్యాక్, ఏ8ఎల్, క్యూ5, క్యూ7, ఆర్ఎస్5 కూపే, ఆర్8 స్పోర్ట్స్ కార్, ఆర్8 స్పైడర్ కార్లను విక్రయిస్తోంది. ఈ నెలలో పశ్చిమ ఢిల్లీ, కోయంబత్తూర్, నాగ్‌పూర్‌లలో మూడు డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయనున్నామని ఆడి తెలిపింది.

More from DriveSpark

Article Published On: Friday, March 2, 2012, 16:58 [IST]
English summary
Audi, the German luxury car manufacturer, has once again achieved remarkable performance in India with sale of 600 cars in February 2012 – a growth of 33 percent over the same period last year (February 2011: 450 cars). Powering ahead confidently with its ambitious outlook for 2012, the brand with the four rings has plans to sell 8000 cars this year, which will be a significant growth over last year (2011: 5511 cars).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+