మొట్టమొదటి సారిగా బిఎమ్‌డబ్ల్యూని ఓవర్‌టేక్ చేసిన ఆడి
ఆడికు అత్యంత కీలక మార్కెట్లయిన చైనా, అమెరికా, రష్యా వంటి దేశాల్లో ఆడి కార్లకు గిరాకీ బాగా పెరగడంతో గడచిన ఏప్రిల్ నెలలో ఆడి భారీ అమ్మకాలను నమోదు చేసుకుంది. ఏప్రిల్ 2012లో ఆడి గ్లోబల్ సేల్స్ 14.4 శాతం వృద్ధిని సాధించి మొత్తం 1,25,200 యూనిట్లను విక్రయించింది. ఇదే సమయంలో బిఎమ్‌డబ్ల్యూ కూడా 1,21,476 యూనిట్లను విక్రయించి 7.4 శాతం వృద్ధిని తమ ఖాతాలో వేసుకుంది.
వాహనాల అమ్మకాల సంఖ్య పరంగా ఇరు కంపెనీలకు పెద్దగా తేడా లేకపోయినప్పటి, అమ్మకాల వృద్ధి రేటులో మాత్రం ఆడి బిఎమ్‌డబ్ల్యూ కన్నా రెండు రెట్లు అధిక వృద్ధిని నమోదు చేసుకుంది. దీంతో గత మార్చి నెల వరకూ టాప్ వన్ పొజిషన్‌లో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ఏప్రిల్ నెలలో టాప్ పొజిషన్‌కు పోడిపోయింది. అయితే, వార్షిక అమ్మకాల సంఖ్యను గమనిస్తే మాత్రం, బిఎమ్‌డబ్ల్యూ కన్నా ఆడి కాస్తంత వెనుకంజలో ఉంది.


Click it and Unblock the Notifications









