ఆయుధాలతో కూడిన కార్లను అందించనున్న ఆడి ఇండియా

Audi A8 L Security
ఇప్పటి వరకూ భారత్‌లో విలాసవంతమైన కార్లను మాత్రమే అందిస్తూ వచ్చిన జర్మన్ ఆటో దిగ్గడం ఆడి, ఇకపై జేమ్స్ బాండ్ సినిమాల్లో మాదిరిగా ఆయుధాలతో (ఆర్మ్‌డ్) కూడిన కార్లను కూడా అందించనుంది. ఈ మేరకు ఆడి రూపొందించిన అత్యంత శక్తివంతమైన, సురక్షితమైన కారు 'ఏ8 ఎల్‌ సెక్యూరిటీ'ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ ఏర్పాట్లు చేసింది. దేశీయ విపణిలో దీని ధర రూ.5 కోట్లుగా ఉంది.

ఈ కారుపై ఎకె-47 వంటి తుపాకులతో కాల్పులు జరిపినా, హ్యాండ్‌ గ్రనేడ్‌‌లు విసిరినా లోపల ఉండే ప్రయాణికులకు ఎలాంటి హాని కలుగకుండా ఉండేలా దీన్ని డిజైన్ చేశామని కంపెనీ తెలిపింది. అయితే, ఈ కారును సొంతం చేసుకోవడం అంత సులువు కాదు. దీన్ని కొనాలనుకునే వారు అటు ఆడి కంపెనీ జర్మనీ సెక్యూరిటీ డివిజన్‌తో సంప్రదింపులు జరపడమే కాకుండా, ఇంటు భారత రక్షణ శాఖ నుండి కూడా అనుమతులు పొందాల్సి ఉంటుంది.

ఈ కారు తయారీ ఫార్ములాను రహస్యంగా ఉంచేందుకు గానూ కంపెనీ అతి కొద్ది మందితో జర్మనీలోని ప్లాంటులో పూర్తి కట్టుదిట్టమైన భద్రతల మధ్య తయారు చేస్తోంది. న్నట్టు తెలిపారు. పేలుళ్లను తట్టుకునేందుకు వీలుగా యాంటీ మాగ్నెటిక్‌ ప్లేటింగ్‌తో కూడిన అత్యంత బలమైన ఉక్కు, అరామిడ్‌ ఫైబర్‌, సిరామిక్‌, మల్టీ-లేయర్‌ గ్లాస్‌, స్పెషల్‌ అల్యూమినియం అల్లాయ్‌లను ఉపయోగించారు.

ఇంకా ఇందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కమ్యూనికేషన్‌ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. విషపూరిత రసాయన వాయువులు వెలువడినా కూడా కారులో ఉన్న వారికి ఎలాంటి హాని కలుగకుండా ఉండేలా దీన్ని తీర్చిదిద్దారు. ఈ ఏడాదిలో మొదటి ఏ8 ఎల్ సెక్యూరిటీ కారును ఆడి భారత్‌లో డెలివరీ చేయనుంది. ఇప్పటికే ఈ కారుకు ప్రభుత్వం, టాప్‌ కార్పొరేట్‌ సంస్థల నుంచి 20 వరకూ ఎంక్వయిరీలు వచ్చాయి.

Article Published On: Monday, January 30, 2012, 14:53 [IST]
English summary
German auto major Audi is eyeing to enter the high-end armored car market in India with its A8 L Security model that could cost around Rs 5 crore, and the first vehicle is likely to be delivered this year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+