జూన్ 2012 నాటికి మార్కెట్లోకి రానున్న ఆడి క్యూ3

జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా, గడచిన జనవరిలో ఢిల్లీలో జరిగిన 2012 ఆటో ఎక్స్‌పోలో ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ చేతుల మీదుగా ఆవిష్కరించిన సరికొత్త "క్యూ3" ఎస్‌యూవీని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనుంది. మార్కెట్ సమాచారం ప్రకారం ఈ ఏడాది జూన్ నాటికి ఆడి క్యూ3 ఎస్‌యూవీ భారత మార్కెట్లో వాణిజ్యపరంగా లభ్యం కానుంది.

ఆల్-వీల్ (ఫోర్-వీల్) డ్రైవ్ సిస్టమ్‌తో లభించనున్న ఆడి క్యూ3లో తొలుత 2.0 లీటర్, ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఇది 177 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేయనుంది. అలాగే, ఇందులో 2.0 లీటర్ డైరెక్ట్ ఇంజక్షన్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా కంపెనీ విడుదల చేసే ఆస్కారం ఉంది. ఇది సెప్టెంబర్ నెల నాటికి మార్కెట్లో అందుబాటులోకి రావచ్చని అంచనా.

డీజిల్ వేరియంట్ ఆడి క్యూ3 ఎస్‌యూవీ ధర రూ.23-26 లక్షల రేంజ్‌లో ఉండనుంది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌యూవీ, మినీ కంట్రీమ్యాన్, మెర్సిడెస్ బెంజ్ బి క్లాస్ వంటికార్లకు ఇది పోటీగా నిలువనుంది. క్యూ3 ఎస్‌యూవీను ఔరంగాబాద్‌ ప్లాంట్‌లో అసెంబ్లింగ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ సవంత్సరంలో ఆడి క్యూ3 ఎస్‌యూవీ తమకు అత్యంత కీలకమైన ఉత్పత్తి అని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ అన్నారు.

More from DriveSpark

Article Published On: Monday, March 5, 2012, 18:19 [IST]
English summary
German premium carmaker Audi India will commercially launch the much awaited SUV Q3 in India by June 2012. The new Audi Q3 is equipped with four-cylinder, 2.0-litre diesel engine, which generates 177 bhp power. The expected price of diesel version Audi Q3 is around Rs 23-26 lakh.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+