జీరో పర్సెంట్ వడ్డీకే ఏ4 సెడాన్‌ను అందిస్తున్న ఆడి
సాధారణ కార్లను కొనుగోలు చేయటానికి తక్కువ వడ్డీ రేటు కలిగిన రుణాలు దొరకటమే గగనమైపోతున్న నేటి రోజుల్లో కేవలం జీరో పర్సెంట్ (0%) వడ్డీ రేటుకే రుణాలిస్తోమంటోంది జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా. ఈ జర్మన్ కార్ మేకర్ అందిస్తున్న ప్రీమియం సెడాన్ ఆడి ఏ4 కోసం కంపెనీ ఈ జీరో పర్సెంట్ వడ్డీ రేట్ స్కీమ్‌ను ఆఫర్ చేస్తోంది.
ఆడి ఏ4 డీజిల్ వేరియంట్ సెడాన్‌పై 36 నెలల కాల వ్యవధికి గానూ రూ.24 లక్షల రుణాన్ని జీరో పర్సెంట్ వడ్డీ (*షరతులు వర్తిస్తాయి)కే ఆఫర్ చేస్తున్నామని ఆడి ఇండియా ఓ వాణిజ్య ప్రకటనలో పేర్కొంది. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమేనని, యూనియన్ బడ్జెట్ 2012-13 ముందు మిగిలి ఉన్న కార్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఆడి పేర్కొంది. త్వరపడండి ఈ ఆఫర్ స్టాక్ మిగిలి ఉన్నంత వరకూ మాత్రమే.
బడ్జెట్‌కు ముందు దిగుమతి చేసుకున్న విడిభాగాలపై 60 శాతం మాత్రమే దిగుమతి సుంఖం ఉండంటంతో బడ్జెట్‌కు ముందు అసెంబ్లింగ్ చేసిన ఈ కార్లపై కంపెనీ జీరో పర్సెంట్ వడ్డీ రేట్ ఆఫర్‌ను ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. దేశీయ విపణిలో ఆడి అందిస్తున్న కార్లలో ఏ4 సెడాన్ అత్యంత చవకైనది. ఇది ఐదు ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతుంది. దీని ధర రూ.24 లక్షల నుండి ప్రారంభం అవుతుంది.


Click it and Unblock the Notifications









