భోఫాల్‌లో ఓ కొత్త షోరూమ్‌ను ప్రారంభించిన ఆడి ఇండియా
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా భారత మార్కెట్లో కొనుగోలుదారులకు మరింత చేరువయ్యేందుకు గానూ తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకునే పనిలో బిజీ బిజీగా ఉంది. ఇందులో భాగంగానే, తాజాగా మధ్యప్రదేశ్‌లో ఆడి ఇండియా తమ రెండవ షోరూమ్‌ను ప్రారంభించింది. మధ్యప్రదేశ్‌లోని భోఫాల్‌లో ఈ కొత్త షోరూమ్‌ను ఆడి ఇండియా ఓపెన్ చేసింది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇప్పటికే ఓ ఆడి షోరూమ్ ఉంది. కాగా.. కొత్తగా భోఫాల్‌లో ఏర్పాటు చేసిన ప్రపంచ-స్థాయి షోరూమ్ ఆడి ఇండియా భారత మార్కెట్లో 19వ షోరూమ్. ప్రస్తుత సంవత్సరంలో మరో ఆరు కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆడి ఇండియా సన్నాహాలు చేస్తుంది. ఆడి ఇండియా భారత మార్కెట్లో అందిస్తున్న పూర్తి శ్రేణి కార్లు ఈ భోఫాల్ షోరూమ్‌లో లభ్యం కానున్నాయి.
గడచిన సంవత్సరంతో పోల్చుకుంటే ప్రస్తుతం సంవత్సరంలో భారత మార్కెట్‌లో 45 శాతం అమ్మకాల వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆడి ఇండియా పేర్కొంది. గడచిన సంవత్సరంలో ఆడి ఇండియా మొత్తం 5,511 యూనిట్లను విక్రయించింది. కాగా.. ప్రస్తుతం సంవత్సరంలో సుమారు 8,000 యూనిట్లను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నామని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఆడి అధీకృత షోరూమ్‌ల చిరునామాలు:
Audi Ahmedabad - Rudra-Path, S.G. Road
Audi Bengaluru - Survey No 6/1, Beratana Agrahara, 15 KM Road, Hosur Road, Electronic city P.O
Audi Bhopal - G-34-B, Arera Hills
Audi Chandigarh - Plot No. 171, Industrial Area, Phase I
Audi Chennai - 535, Anna Salai, Nandaman
Audi Coimbatore - No.1020-Avinashi Road
Audi Delhi South - B -1/H 1, Mohan Co-operative Industrial Estate, Mathura Road
Audi Delhi West: A 21, Naraina Vihar
Audi Gurgaon - Orchid Centre, Sector - 54, Golf Course Road
Audi Hyderabad - 8-2-684/A, Road No.12, Banjara Hills
Audi Indore - NRK Business Park, Plot B1, Vijay Nagar
Audi Jaipur- Kamal & Co. Premises, Opp GPO, M.I. Road
Audi Kochi - NH. 47, Vytilla Aroor, Bye Pass Road, Marudu P.O.
Audi Kolkata - 9 AJC Bose Road
Audi Ludhiana - GT Road
Audi Mumbai West - New Link Road, Andheri West
Audi Nagpur - 1902, H-Tower, Ujjwal Nagar, Wardha Road
Audi Pune - Pro1 Business Centre, Plot No. 395+396, Senapati Bapat Road, Shivajinagar
Audi Surat - Nr. Rundhnath Mahadev Mandir,Surat Dumas Road


Click it and Unblock the Notifications








