మే నెలలో జోరుగా సాగిన ఆడి లగ్జరీ కార్ల అమ్మకాలు

జర్మనీకు చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ కంపెనీ ఆడి ఇండియా మే నెలలో అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. కొత్త ఆడి ఏ4 సెడాన్‌ను విడుదల చేయనున్న నేపథ్యంలో పాత ఆడి ఏ4 సెడాన్‌పై తగ్గింపును, ప్రత్యేక వడ్డీ స్కీమ్‌లను ఆఫర్ చేయడంతో పాటుగా, కంపెనీ నుండి అత్యంత పాపులర్ అయిన ఆడి క్యూ5, ఆడి క్యూ7 ఎస్‌యూవీ మోడళ్ల అమ్మకాలు జోరుగా సాగాయి.

గడచిన మే 2012 నెలలో ఆడి ఇండియా మొత్తం 450 కార్లను విక్రయించి, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోల్చుకుంటే 10 శాతం వృద్ధిని తన ఖాతాలో వేసుకుంది. మే 2011 నెలలో ఆడి ఇండియా మొత్తం 408 కార్లను విక్రయించింది. కాగా.. జనవరి 2012 నుండి మే 2012 వరకూ అమ్మకాలను గమనిస్తే అవి 37 శాతం మేర వృద్ధి చెంది 3281 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఇవి 2394 యూనిట్లుగా ఉన్నట్లు ఆడి ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.


మొత్తం అమ్మకాలలో కొత్త ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి క్యూ5, ఆడి క్యూ7 మోడళ్లే అధికంగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది మార్కెట్లోకి విడుదల చేయనున్న కొత్త ఆడి క్యూ3 ఎస్‌యూవీ ఈ అమ్మకాల సంఖ్య మరింత వృద్ధి చెందగలదని ఆశిస్తున్నామని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ తెలిపారు. ఈ నెలలోనే ఆడి క్యూ3 ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 8,000 వాహనాలను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నామని ఆయన చెప్పారు.

ప్రస్తుతం ఆడి ఇండియాకు దేశవ్యాప్తంగా 19 డీలర్‌‌షిప్‌లు ఉండగా, 2012 చివరి నాటికి ఈ సంఖ్యను 25కు పెంచుకునేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి ఏ7 స్పోర్ట్‌బ్యాక్, ఆడి ఏ8ఎల్, ఆడి క్యూ5, ఆడి క్యూ7, ఆడి ఆర్ఎస్5 కూపే, ఆడి టిటి, ఆడి ఆర్8 సూపర్ స్పోర్ట్స్ కార్, ఆడి ఆర్8 స్పైడర్ కార్లను ఆడి ఇండియా దేశీయ విపణిలో అందిస్తుంది. అహ్మదాబాద్, బెంగుళూరు, ఛండీఘడ్, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ సౌత్, ఢిల్లీ వెస్ట్, గుర్గావ్, హైదరాబాద్, ఇండోర్, భోఫాల్, జైపూర్, కొచ్చి, కోల్‌కటా, లుథియానా, ముంబై వెస్ట్, నాగ్‌పూర్, పూనే, సూరత్ నగరాల్లో ఆడి ఇండియా షోరూమ్‌లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, June 1, 2012, 18:10 [IST]
English summary
Audi, the German luxury car manufacturer, continues to perform successfully in India as it marked up a sale of 450 cars in May 2012 - a growth of 10 percent over the same period last year (May 2011: 408 cars).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+