జూన్‌లో 76 శాతం పెరిగిన ఆడి ఇండియా అమ్మకాలు
దేశంలో లగ్జరీ కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. లగ్జరీ వాహనాలో సెగ్మెంట్లోని కంపెనీ పోటీ పడి మరీ సరమైన ధరలకే కొత్త వాహనాలను అందిస్తుండటంతో ఈ విభంగంలో అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ గత నెలలో ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసుకుంది.
జూన్ 2012లో ఆడి ఇండియా మొత్తం 718 కార్లను విక్రయించి, గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఏకంగా 76 శాతం వృద్ధిని తన ఖాతాలో వేసుకుంది. జూన్ 2011లో ఆడి ఇండియా మొత్తం అమ్మకాలు కేవలం 408 యూనిట్లు మాత్రమే. కాగా.. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ పరిశీలిస్తే ఆడి ఇండియా మొత్తం అమ్మకాలు 43 శాతం వృద్ధిని కనబరిచి 4,000 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయానికి ఇవి 2802 యూనిట్లు మాత్రమే ఉన్నాయి.
గడచిన జూన్ నెలలో ఆడి ఇండియా అమ్మకాలు జోరుగా సాగటానికి ప్రధాన కారణం కంపెనీ తాజాగా ప్రవేశపెట్టిన ఎంట్రీ లెవల్ ప్రీమియం ఎస్‌యూవీ 'ఆడి క్యూ3' మోడలే. విడుదైలన ఐదు రోజుల్లోగా మొత్తం 500 యూనిట్లు బుకింగ్ కావడంతో, ప్రస్తుత ప్రతికూల మార్కెట్ వాతావరణ పరిస్థితుల్లో సైతం కంపెనీ ఇంతటి భారీ వృద్ధి నమోదు చేసుకోగలిగింది.
ఆడి క్యూ5 కాంపాక్ట్ ప్రీమియం ఎస్‌యూవీకి లభిస్తున్న అశేష ఆదరణను దృష్టిలో ఉంచుకొని, ఈ మోడల్ కోసం సెకండ్ ఫేస్ (తర్వాతి 500 యూనిట్ల కోసం) బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే ఈ ఏడాది చివరి నాటికి 8,000 కార్లను విక్రయించగలమని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఆడి ఇండియాకు దేశవ్యాప్తంగా 19 మంది డీలర్లు ఉండగా, ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 25కు పెంచే దిశగా ఆడి ఇండియా అడుగులు వేస్తుంది.
ఆడి క్యూ3 లగ్జరీ ఎస్‌యూవీ విషయానికి వస్తే.. ఇది రెండు వేరియంట్లలో, 2.0 టిడిఐ ఇంజన్‌తో లభ్యమవుతుంది. ఆడి క్యూ3 ప్రారంభ వేరియంట్ ధర రూ. 26.71 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 32.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.


Click it and Unblock the Notifications









