భారత్‌లో ఆడి కార్‌లైఫ్-అడ్వాన్స్‌ను పరిచయం చేసిన ఆడి
జర్మన్ లగ్జీరా కార్ మేకర్ ఆడి మరియు ఆర్థిక విభాగం ఆడి ఫైనాన్స్‌లు సంయుక్తంగా కలిసి భారత్‌లో ఓ సరికొత్త పథకాన్ని ప్రారంభించాయి. తమ కస్టమర్ల కోసం 'ఆడి కార్‌లైఫ్-అడ్వాన్స్' అనే స్కీమ్‌ను ప్రారంభిస్తున్నామని, ఇందులో భాగంగా ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి క్యూ5 కార్లపై ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్, సర్వీస్ ప్లాన్, అదనపు వారంటీ వంటి సదుపాయలను అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది.
ఆడి కార్‌లైఫ్-అడ్వాన్స్ ప్యాకేజ్ క్రింద తొలిసారిగా ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి క్యూ5 మోడళ్లపై అతి తక్కువ ఈఎమ్ఐ. పూర్తి రిస్క్ కవరేజ్, సర్వీస్ ప్లాన్, అదనపు వారంటీలను పొందవచ్చునని, ఈ ప్యాకేజ్‌ను సులభ వాయిదాల పద్దతి క్రింద చెల్లించవచ్చునని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ తెలిపారు. మార్కెట్ రీసెర్చ్ ప్రకారం గమనిస్తే.. కార్ లీజింగ్ విషయంలో ఇండియన్ మార్కెట్ ఇంకా చెప్పుకోదగిన ప్రాధాన్యతను సంతరించుకోలేదని, ఈ నేపథ్యంలో ఆడి కార్‌లైఫ్-అడ్వాన్స్ ప్యాకేజ్ ఇందుకు చక్కగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
ఈ స్కీమ్‌లో భాగంగా, కార్ లీజింగ్‌కు సంబంధించి ఓనర్‌షిప్ ప్రివిలేజ్‌తో కూడిన అన్ని ప్రయోజనాలను ఇందులో పొందవచ్చునని ప్రెస్కీ వివరించారు. ఈ స్కీమ్‌కు మరిన్ని పూర్తి వివరాలను సమీపంలోని అధీకృత ఆడి డీలర్‌షిప్ నుండి పొందవచ్చు. ప్రస్తుత ఆడి ఇండియా దేశీయ మార్కెట్లో ఏ4, ఏ6, ఏ7 స్పోర్ట్స్‌బ్యాక్, ఏ8 ఎల్, క్యూ5, క్యూ7, ఆర్ఎస్5 కూపే, టిటి, ఆ8 స్పోర్ట్స్ కార్, ఆర్8 స్పైడర్ మోడళ్లను అందిస్తుంది.


Click it and Unblock the Notifications









