లండన్‌లో తొలి డిజిటల్ కార్ షోరూమ్ ప్రారంభించిన ఆడి
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ ఆడి లండన్‌లో ఓ కొత్త రకమైన డిజిటల్ షోరూమ్‌ను ప్రారంభించింది. 'ఆడి సిటీ' పేరుతో ప్రారంభమైన ఈ షోరూమ్‌లో కార్లకు బదులు డిజిటల్ స్క్రీన్‌లను కంపెనీ ఏర్పాటు చేసింది. పెరుగుతున్న మోడళ్లు, వేరియంట్లు కారణంగా షోరూమ్‌లలో అన్ని కార్లను ప్రదర్శనకు ఉంచడం కష్టం కాబట్టి, ఇందుకు పరిష్కార మార్గంగా ఆడి ఈ డిజిటల్ షోరూమ్‌ను ప్రారంభించింది.
ఈ డిజిటల్ షోరూమ్‌కు విచ్చేసే కస్టమర్లు పెద్ద డిజిటల్ స్క్రీన్లపై తమకు నచ్చిన కారును ఎంచుకుని, పూర్తిగా తాము ప్రత్యక్షంగా కారును చూసి ఎలాంటి అనుభూతిని పొందుతారో అంత కన్నా మెరుగైన అతునుభూతిని పొందవచ్చు. ఇంజన్ ఆన్ సౌండ్, సైలెన్సర్ బీటింగ్, హారన్ వంటి శబ్ధాలను మొదలుకొని డోర్ ఓపెన్, క్లోజ్ సౌండ్ వంటి శబ్ధాల వరకూ అన్నింటి స్పష్టంగా ఈ డిజిటల్ షోరూమ్‌లో వినొచ్చు.
షోరూమ్‌లను ఏర్పాటు చేయడానికి స్థలం తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ డిజిటల్ షోరూమ్‌లు మంచి ఆప్షన్‌గా నిలుస్తాయి. రానున్న మూడేళ్లలో ఇలాంటివి 20కు పైగా డిజిటల్ షోరూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆడి భావిస్తోంది. ఈ డిజిటల్ స్క్రీన్స్ ద్వారా కారులోని ప్రతి భాగాన్ని కొనుగోలుదారులు పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. అలాగే, ఈ షోరూమ్‌లో కలర్, వుడ్, లెథర్ ఆప్షన్ల కోసం శాంపిల్స్‌ను కూడా ఉంచడం జరిగింది.
సింపుల్‌గా చెప్పాలంటే, కొనుగోలుదారులు తాము కొనుగోలు చేయాలనున్న ఆడి కార్లను తమకు నచ్చిన విధంగా సింగిల్ స్క్రీన్ పైనే మార్చుకునే అవకాశం ఈ డిజిటల్ షోరూమ్‌లో ఉంటుంది. కొనుగోలుదారులు కారును కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న తర్వాత టెస్ట్ డ్రైవ్ కోసం ఆడి ఏర్పాట్లు చేస్తుంది. కస్టమర్లు ఇలా కారును భౌతికంగా టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత సంతృప్తి చెందితేనే కారును కొనుగోలు చేయవచ్చు. మరి బాగుంది కదూ ఆడి డిజిటల్ ప్లాన్..!


Click it and Unblock the Notifications









